AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి
Balochistan
Surya Kala
|

Updated on: Aug 26, 2024 | 3:33 PM

Share

పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే కొంత మంది సాయుధులు మృత్యువుతో ఆట ఆడారు. ఇక్కడ కొంతమంది సాయుధ వ్యక్తులు రోడ్డుమీద వెళ్తోన్న ట్రక్కులు, బస్సుల నుండి ప్రయాణికులను దింపారు. తర్వాత వారిని ఒకొక్కరిని పరిశీలించి ఆపై కొంత మంది మీద కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో కనీసం 23 మంది మరణించారని తెలుస్తోంది. పంజాబ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముసాఖేల్ సాయుధులు దాడి చేశారని పాకిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ తెలిపారు.

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.

ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

ఇవి కూడా చదవండి

సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించే పనిలో పడ్డారని తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి

దాదాపు నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి దాడి జరిగింది. అంతకుముందు ఏప్రిల్‌లో నోష్కీ సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సులో నుండి దింపి, వారి ఐడి కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు. ఏప్రిల్‌కు ముందు, గతేడాది అక్టోబర్‌లో బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలు హత్యకు గురయ్యారు. ఈ హత్యలన్నీ పంజాబ్‌ ప్రాంత వాసులే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారందరూ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఈ దాడులు హత్యలు వారి జాతి నేపథ్యం కారణంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇది కాకుండా 2015 సంవత్సరంలో సాయుధ వ్యక్తులు 20 మంది కార్మికులను హత్య చేశారు. అప్పుడు కూడా ఈ వ్యక్తులు కూడా పంజాబ్ వాసులే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..