AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. నార్త్ కొరియా చేతిలో సూసైడ్ డ్రోన్స్.. ఎలా పనిచేస్తాయంటే..?

ఈ క్రమంలోనే తాజాగా ఈ దేశంలో ప్రదర్శించిన కొత్త డ్రోన్స్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెర తీసింది. 'సూసైడ్‌ డ్రోన్స్‌'ను ప్రదర్శించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. తమ దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి ఈ డ్రోన్స్‌ ఆయధాలను తయారీని మరింత వేగవంతం చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ తెలిపారు. ఉత్తర కొరియాకు ధీటుగా..

వామ్మో.. నార్త్ కొరియా చేతిలో సూసైడ్ డ్రోన్స్.. ఎలా పనిచేస్తాయంటే..?
Suicide Drone
Narender Vaitla
|

Updated on: Aug 26, 2024 | 9:57 AM

Share

నార్త్‌ కొరియా.. ఈ పేరు వినగానే పాలకుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ గుర్తొస్తారు. ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంతో ప్రపంచానికి తెలియదు. పక్కనున్న సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను రూపొందిస్తూ ప్రపంచమంతా వస్తువులను ఎగుమతి చేస్తుంటే నార్త్‌ కొరియా మాత్రం అత్యంత రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో కూడా అసలు ఈ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియలేదు. అయితే కేవలం యుద్ధ సన్నాహాలు, ఆయుధాల ప్రదర్శనకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు వివరాలను విడుదల చేస్తుందీ దేశం.

ఈ క్రమంలోనే తాజాగా ఈ దేశంలో ప్రదర్శించిన కొత్త డ్రోన్స్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెర తీసింది. ‘సూసైడ్‌ డ్రోన్స్‌’ను ప్రదర్శించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. తమ దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి ఈ డ్రోన్స్‌ ఆయధాలను తయారీని మరింత వేగవంతం చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ తెలిపారు. ఉత్తర కొరియాకు ధీటుగా.. తమ రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకునే లక్ష్యంతో అమెరికా, దక్షిణ కొరియా బలగాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.

శనివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో K-2 యుద్ధ ట్యాంక్ వంటి వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న డ్రోన్‌లు ప్రదర్శించారు. ఈ డ్రోన్‌ను ఎక్స్‌ షేప్‌లో ఉండే రెక్కలతో రూపొందించారు. దూరం నుంచి దాడి చేసే డ్రోన్‌లా కాకుండా.. ఈ సూసైడ్‌ డ్రోన్స్‌ నేరుగా లక్ష్యాలను క్రాష్ చేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ… ఆధునిక యుద్ధాల్లో డ్రోన్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని, సాధ్యమైనంత త్వరగా ఈ డ్రోన్‌లను తమ సైకికదళంలో భాగం చేస్తామని చెప్పుకొచ్చారు. నిఘా డ్రోన్స్‌, నీటి అడుగున ఉన్న లక్ష్యాలను చేధించేలా వీటిని రూపొందిచనట్లు తెలిపారు.

ఉక్రెయిన్‌, రష్యా వివాదం అంతర్జాతీయ దృష్టిని మళ్లించడంతో, కిమ్ తన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించిన తరుణంలో కిమ్ దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని ఆయుధాగారాన్ని విస్తరిస్తున్నారు. వీటిలో స్వల్ప-శ్రేణి క్షిపణులతో ఆపటు ఆర్టిలరీ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అవి అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఉత్తర కొరియా పేర్కొంది. మరి కిమ్‌ చేపట్టిన ఈ చర్యపై అమెరికాతో పాటు దక్షిణ కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..