Biggest Diamond: ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

Biggest Diamond: ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

Anil kumar poka

|

Updated on: Aug 26, 2024 | 11:11 AM

ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌ వానా ఒకటి. ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు పేర్కొంది.

ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌ వానా ఒకటి. ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. అధిక నాణ్యత కలిగిన ఈ వజ్రం చెక్కుచెదరకుండా ఉందని లుకానా తెలపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్‌ డైమండ్‌ బయటపడింది.

దక్షిణాఫ్రికాలో 1905లో వెలికి తీసిన 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్‌ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అయితే తాజాగా లభ్యమైన ఈ వజ్రం రెండో అతి పెద్దదిగా నిలిచినట్లు లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. అయితే ఈ వజ్రం విలువ, నాణ్యత విషయాలను మాత్రం ఆ సంస్థ తెలియజేయలేదు. అసాధారణమైన ఈ వజ్రం లభ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.