Brain Surgery: బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
అమెరికాలోని జార్జియాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి బ్రెయిన్‌లో బ్లీడింగ్ కావడం గుర్తించారు. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 6 అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..
అమెరికాలోని జార్జియాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి బ్రెయిన్‌లో బ్లీడింగ్ కావడం గుర్తించారు. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 6 అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా.. అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు.
దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరిన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది.
ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికి అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.