Kolkata: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని,
కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్.. ఘటనకు ముందు రోజు ఆస్పత్రిలోని చెస్ట్ మెడిసన్ వార్డ్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారు. వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. ఆ నలుగురు జూనియర్ డాక్టర్ల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది. మరోవైపు బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్ఏ రిపోర్ట్ వచ్చాకే అసలు విషయం తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ నమూనాలను సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పరీక్షిస్తున్నారు. త్వరలోనే నివేదిక అందుబాటులోకి రానుంది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలను ఇప్పటికే కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

