America: తుపాకీ మోతతో వణికిపోయిన అమెరికా.. మెషిన్ గన్ తో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి..!

మరోసారి తుపాకీ కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు...

America: తుపాకీ మోతతో వణికిపోయిన అమెరికా.. మెషిన్ గన్ తో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి..!
Gun Shooting
Follow us

|

Updated on: Jan 22, 2023 | 4:42 PM

మరోసారి తుపాకీ కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలు జరుగుతండగా.. ఈ ఘటన జరగడం తీవ్ర విషాదం నింపింది. కాల్పుల్లో సుమారు పది మంది వరకు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తునానికి ఆరుగురికి గాయాలైనట్లు గుర్తించారు. కాల్పులు చేసిన వ్యక్తి.. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. ఘఠనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

అయితే.. ఓ వ్యక్తి భారీ మెషీన్‌ గన్‌తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో సియాంగ్‌ వాన్‌ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో అతడి రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారు. ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పారు. డ్యాన్సింగ్‌ క్లబ్‌ లక్ష్యంగా దాడి చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల కుటుంబీకుల రోదనలతో ఘటన స్థలం బీభత్సంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..