బలవంతుడిదే రాజ్యం.. రాసిందే శాసనమా..! ప్రపంచానికేనా ట్రంప్ నీతి సూత్రాలు..
ఒకప్పుడు 'లీగ్ ఆఫ్ నేషన్స్' అనే గ్రూప్ ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక.. ఇకపై అలాంటి యుద్ధాలు జరక్కుండా ఏర్పాటైందది. బట్.. కొన్నేళ్లకే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో, 'లీగ్ ఆఫ్ నేషన్స్' అట్టర్ ఫ్లాప్ అయింది యుద్ధాలని ఆపడంలో. ఈసారి ఇంకా శక్తిమంతమైన గ్రూప్‌ను తయారు చేశారు. దానికి యునైటెడ్ నేషన్స్ అనే పేరు పెట్టారు. తెలుగులో ఐక్యరాజ్య సమితి.

‘గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకునేందుకు అమెరికా విశ్వప్రయత్నం’.. ఇది కేవలం ప్రచారమేనా, నిజంగానే అమెరికాకి ఆ ఉద్దేశం ఉందా? ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ డైరెక్ట్‌గా అడిగేశారు ట్రంప్‌ని. ప్రపంచంపై మీ ఆధిపత్యం ఏంటి అనేదే ఆ జర్నలిస్ట్ ప్రశ్నకు అర్థం. ట్రంప్ సమాధానం వింటే ఎంత కోపం వస్తుందంటే.. ‘అంతర్జాతీయ చట్టాలతో తనకసలు పనే లేదు’ అనేశారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అవసరం అని తన డెసిషన్ చెప్పేశారు. సో, గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నేశారన్నది కన్ఫామ్. ఇంతకీ గ్రీన్‌ల్యాండే ఎందుకు? బలం, బలగం ఉందని చెప్పి ఆక్రమించేస్తుందా అమెరికా. ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఇక.. ఒకప్పుడు ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ అనే గ్రూప్ ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక.. ఇకపై అలాంటి యుద్ధాలు జరక్కుండా ఏర్పాటైందది. బట్.. కొన్నేళ్లకే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో, ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ అట్టర్ ఫ్లాప్ అయింది యుద్ధాలని ఆపడంలో. ఈసారి ఇంకా శక్తిమంతమైన గ్రూప్‌ను తయారు చేశారు. దానికి యునైటెడ్ నేషన్స్ అనే పేరు పెట్టారు. తెలుగులో ఐక్యరాజ్య సమితి. మన స్కూల్ బుక్స్‌లో ఎంతో గొప్పగా చదువుకుంటాం దాని గురించి. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందని, దేశాల మధ్య సాయం, సహకారం ఉండేలా కృషి చేస్తుందని. మరి.. ఏం కట్టలు కడుతోందిప్పుడు? మూడో ప్రపంచ యుద్ధం జరగలేదనే మాటే గానీ.. అంతకు మించిన యుద్ధాలు, విధ్వంసాలు జరుగుతున్నాయ్‌గా. ఏ ఒక్క యుద్ధాన్నైనా ఆపిందా....
