Google: గూగుల్ లో కొనసాగుతున్న లైంగిక వేధింపుల పర్వం.. ఏకంగా సీఈవోకు బహిరంగ లేఖ రాసిన ఉద్యోగులు
ఇటీవల గూగుల్ ఆల్ఫాబెట్ ఉద్యోగులు తమపై లైంగిక వేధింపులు జారుతున్నాయంటూ తరచు ఫిర్యాదు చేయడం జరుగుతూ వస్తోంది.

Google: ఇటీవల గూగుల్ ఆల్ఫాబెట్ ఉద్యోగులు తమపై లైంగిక వేధింపులు జారుతున్నాయంటూ తరచు ఫిర్యాదు చేయడం జరుగుతూ వస్తోంది. ఇటీవల గూగుల్ మాజీ ఉద్యోగి ఎమీ నీట్‌ఫీల్డ్ వేధింపులకు గురైతే .. గూగుల్ ఎలా వ్యవహరించిందో చెబుతూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. ఆ కథనం వెలువడిన కొద్దిరోజులకే ఇప్పుడు మరో కలకలం టెక్ దిగ్గజం గూగుల్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ సంస్థలోని 500 మంది ఉద్యోగులు గూగుల్ సీఈఓకి ఓ లేఖ రాశారు. తమకు సంస్థలో వేధింపులు తారాస్థాయికి చేరాయంటూ ఆ బహిరంగ లేఖలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి తెలియచేశారు. తమను ఆదుకోవాలంటూ ఆ ఉద్యోగులు ఆ లేఖలో కోరారు. అంతేకాదు.. సంస్థలో వేధింపులకు పాల్పడుతున్న వారిని రక్షించడం ఆపాలంటూ అభ్యర్ధించారు. ఇప్పుడు ఈ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అంతకు ముందు ఇదే అంశంపై మాజీ ఉద్యోగి ఎమీ నీట్‌ఫీల్డ్ ఉదంతాన్ని ఆ లేఖలో ఉద్యోగులు ప్రస్తావించారు.
ఆమె ‘గూగుల్‌లో పనిచేసిన తర్వాత ఎన్నడూ మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు’ ఎమీ నీట్‌ఫీల్డ్ తన అనుభవాలను ఒక కథనంలో వెల్లడించారు. ‘‘నన్ను వేధించిన వ్యక్తితోనే బలవంతంగా ముఖాముఖి భేటీలు నిర్వహించారు.. అతని పక్క సీటులోనే కూర్చోబెట్టారు.. అతడితో ఇబ్బందిగా ఉందని చెప్పినా.. విచారణాధికారులు పట్టించుకోలేదు.. అంతేకాదు, తనకే ‘కౌన్సెలింగ్ తీసుకోండి, ఇంటి నుంచి పనిచేయండి, లేదా సెలవుపై వెళ్లండి’ అని సలహా ఇచ్చారు.. ఈ అనుభవం తనకు మాత్రమే కాదని, అంతకు ముందు వేధింపులకు గురైన చాలా మంది విషయంలోనూ గూగుల్ ఇలాగే వ్యవహరించినట్టు తెలిసిందని’’ అమె వివరించారు. అంటూ ఈ విషయాన్ని గూగుల్ సీఈవోకు రాసిన లేఖలో ఉద్యోగులు ఉటంకించారు.
ఇందులో ఏమాత్రం అబద్ధం లేదనీ, గూగుల్ లో అదేవిధంగా జరుగుతోందని చెప్పారు. ఎమీధీ ఏమీ తొలికేసు కాదని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. గతంలోనూ వేధింపులకు పాల్పడిన వారి పక్షానే సంస్థ మాట్లాడిందని ఆరోపించారు.
ఈ వేధింపులకు వ్యతిరేకంగా 2018లో 20 వేళా మంది ఉద్యోగులు నిరసన తెలిపిన విషయాన్నీ ఆ లేఖలో ఉటంకించిన ఉద్యోగులు.. అయినప్పటికీ సంస్థ వైఖరిలో మార్పురాలేదన్నారు.
నిజానికి లైంగిక వేధింపులకు గురి అయినవారు భారాన్ని భరించాల్సివస్తోంది. ఆల్ఫాబెట్‌ను వదిలేస్తున్న నిందితులకు ప్రతిఫలం దక్కుతోంది. అదీ భారీగా అని ఆలేఖలో ఆరోపించారు. ఓ మహిళా ఉద్యోగిని తనతో ఓరల్ సెక్స్‌లో పాల్గొనాలంటూ వేధించిన ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్‌వేర్ క్రియేటర్ ఆండీ రుబిన్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ప్యాకేజీ కింద 90 మిలియన్ డాలర్లు చెల్లించింది.. లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ సెర్చ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింఘాల్‌కు కూడా 35 మిలియన్ డాలర్లు ఇచ్చిందని లేఖలో ప్రస్తావించారు.
అయితే, ఈ లేఖపై స్పందించిన గూగుల్ మాత్రం ఉద్యోగుల ఆందోళనలపై విచారం తీరును మెరుగుపరుచుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల సంరక్షణకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంది.
Also Read: Tropical Cyclone Seroja : ఆస్ట్రేలియాలో ‘సెరోజా’ విధ్వంసం – వందలాది ఇళ్లు ధ్వంసం
Space Wastage: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!