China Intelligence: నక్కజిత్తుల చైనా.. గూఢచర్యంలోనూ మహా తెలివితేటలు..ప్రపంచంలోని విషయాలు ఎలా సేకరిస్తోందో తెలుసా?

ఏ విషయంలో అయినా చైనా రూటే సపరేటు. ప్రపంచాధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం ఉండదు. అందులోనూ ఎవరికీ రాని అద్భుతమైన చావు ఐడియాలు చైనా దగ్గర ఉంటాయి.

China Intelligence: నక్కజిత్తుల చైనా.. గూఢచర్యంలోనూ మహా తెలివితేటలు..ప్రపంచంలోని విషయాలు ఎలా సేకరిస్తోందో తెలుసా?
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన చైనా
Follow us
KVD Varma

|

Updated on: Apr 12, 2021 | 6:25 PM

China Intelligence:  ఏ విషయంలో అయినా చైనా రూటే సపరేటు. ప్రపంచాధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం ఉండదు. అందులోనూ ఎవరికీ రాని అద్భుతమైన చావు ఐడియాలు చైనా దగ్గర ఉంటాయి. ఇది చాలా విషయాలలో ప్రపంచానికి అర్ధం అయింది. ఇప్పుటు తాజాగా చైనా గూఢచర్యంలో మహా గడసరిగా వ్యవహరిస్తోన్న విషయం బయటపడింది. అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ ఇలా ప్రపంచంలోని పలు దేశాల గూఢచర్యం గురించి చాలా వరకూ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయా దేశాల గూఢచార సంస్థల పేర్లు చాలా సార్లు అంతర్జాతీయంగా బయటపడ్డాయి.. వాటి మీద చర్చలూ నడిచాయి. కానీ, చైనా గూఢచర్యం గురించి.. లేదా చైనా నడిపించే గూఢచారి సంస్థ గురించి ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా కాదుకదా.. కొద్దిగా కూడా తెలీదు. అంత గూఢంగా గూఢచర్యాన్ని నడిపించేస్తుంటుంది చైనా. అవతలి దేశాల్లో డేటా లేదా రహస్య సమాచారాన్ని ఏమాత్రం సందేహం రానివిధంగా బోర్డార్లు దాటి తమ దేశంలోకి తెప్పించేసుకుంటుంది చైనా. ఇటీవల చైనా థౌసండ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ విధానంలో సమాచార సేకరణ జరుపుతుందని గ్రీకు పత్రిక వెల్లడించింది. ఈ విషయాన్నీ అమెరికా ఎఫ్బీఐ మాజీ అధికారి పాల మూర్ కూడా గతంలో కొంత మేర తెలిపారు.

చైనా ఏం చేస్తుందంటే.. సమాచారాన్ని ఏకమొత్తంగా సేకరించడం చైనా విధానం కాదు. ముక్కలు ముక్కలుగా సమాచారాన్ని సేకరిస్తుంది. దానిని బోర్డర్ దాటిస్తుంది. తరువాత తీరిగ్గా తమదేశంలో ఆ సమాచారాన్నంతా ఒక చోట పోగేసి విశ్లేషిస్తుంది. దీనికోసం చైనా గూఢచారులు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు. ముఖ్యంగా చైనా చేసే ఈ పనిలో జిన్హువా అనే న్యూస్ ఏజన్సీ అతి కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని గ్రీసు పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఈ న్యూస్ ఏజన్సీకి దాదాపు 20 పత్రికలూ, పన్నెండు వరకూ మేగజైన్ లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 107 బ్యూరోలు పనిచేస్తున్నాయి. దాదాపుగా పదివేల మంది ఉద్యోగులు వివిధ దేశాల్లో ఈ న్యూస్ ఏజన్సీ కింద పనిచేస్తున్నారు.

పత్రికలకు ఉండే స్వేచ్ఛను వాడుకుని ఈ ఏజెన్సీ ఉద్యోగులు వివిధ దేశాల్లో పనిచేస్తుంటారు. అదేవిధంగా సమాచార సేకరణ చేస్తారు. ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అవసరమైన వార్తలను సేకరించడంలో ఈ సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందుతారు. వీరిచ్చిన సమాచారం వివిధ రూపాల్లో చైనాకు చేరుతుంది.

అంతేకాదు.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే చైనా విద్యార్ధుల్ని కూడా నిఘా కార్యక్రమాలకు వాడుకుంటారు. వీరిని బెదిరించి.. భయపెట్టే దారిలోకి తెచ్చుకుని తమకు అవసరమైన సమాచార సేకరణకు వాడుకుంటుంది చైనా. ఈ విషయం తెలిసే గత డిసెంబర్ లో ట్రంప్ ప్రభుత్వం వెయ్యిమందికి పైగా చైనా విద్యార్థులను వెనక్కి పంపింది.

అదేవిధంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నారు. బోయింగ్, ఫోక్స్ వేగన్, రోల్స్ రాయిస్, హెచ్ ఎస్ బీసీ వంటి సంస్థల్లో ఉన్నట్టు తెలిసింది. ఇలా చైనా తన దేశం నుంచి వివిధ వర్గాలకు చెందిన వారిని విదేశాల్లో వివిధ స్థాయిలు..పలు రంగాల్లో ఉంచింది. వారితో తనకు కావలసిన సమాచార సేకరణ చేయించుకుంటోంది.

చైనా కుయుక్తుల ముందు ఎవరూ సరిపోరని ఈ గ్రీకు పత్రిక కథనంతో తెలిసిపోయింది. ముక్కలుగా సమాచారాన్ని సేకరించి.. కలిపి దగ్గరకు చేర్చి విశ్లేషించడం ఈ విధానానికి ఆ పత్రిక పెట్టిన పేరు ‘వెయ్యి ఇసుక రేణువుల విధానం.”

Also Read: Alibaba Fine: జాక్‌మాకు చైనా మరో షాక్‌.. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు భారీగా జరిమానా..

Titanic Tragedy: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?