AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alibaba Fine: జాక్‌మాకు చైనా మరో షాక్‌.. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు భారీగా జరిమానా..

Alibaba Fine: ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజం కంపెనీ అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ సంస్థలు కొరఢా ఝుళిపించాయి. దేశీయ మార్కెట్లో తన వ్యాపారానికి ఎదురు లేకుండా చేసేందుకు..

Alibaba Fine: జాక్‌మాకు చైనా మరో షాక్‌.. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు భారీగా జరిమానా..
Alibaba
Subhash Goud
|

Updated on: Apr 11, 2021 | 11:41 PM

Share

Alibaba Fine: ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజం కంపెనీ అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ సంస్థలు కొరఢా ఝుళిపించాయి. దేశీయ మార్కెట్లో తన వ్యాపారానికి ఎదురు లేకుండా చేసేందుకు గానూ యాంటీ-కాంపిటీటివ్‌ ఎత్తుగడలకు అలీబాబా పాల్పడిందని పేర్కొంటూ ఏకంగా 280 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21,000కోట్లు) జరిమానాను విధించినట్లు రెగ్యులేటరీ సంస్థలు తెలిపాయి. గత ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా చైనా జాక్‌ మా సారథ్యంలో గ్రూప్‌.. గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడినట్లు తమ విచారణలో తేలడంతో చైనా ఏకచ్ఛత్రాదిపత్య నిరోధ చట్ట నిబంధనలకు లోబడి భారీ జరిమానాను విధించినట్లు చైనా స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కె ట్‌ రెగ్యులేషన్‌ (ఎస్‌ఏఎంఆర్‌) వెల్లడించింది. 2015 నుంచి మార్కెట్లో అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు అలీబాబా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ వస్తోందని తెలిపింది. దీంతో విక్రేతలతో పాటు కొనుగోలుదారులు కూడా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే పోటీని అరికట్టడానికి తమ పరిశ్రమ ఆధిపత్యాన్ని ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఆన్‌లైన్‌ రిటైలింగ్‌లో పోటీని పరిమితం చేయడానికి అలీబాబా తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిపింది.

అలీబాబా తన ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే మొత్తం వస్తువుల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్‌ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తమ గ్రూప్‌కు చెందిన ఈ కామర్స్ పోర్టల్స్‌లో ఉత్పత్తులను విక్రయించాలి అనుకునే వ్యాపారులు తమతో నే కొనసాగాలని, తమ ప్రత్యర్థి ఈ కామర్స్‌ పోర్టల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని అలీబాబా యాజమాన్యం ఒప్పతిడి తెస్తోందన్న అంశంపై విచారణ జరిపి చైనా మార్కెటింగ్‌ రెగ్యులేటరీ కమిటీ ఈ జరిమానా విధించింది.

ఇవీ చదవండి: 105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన భారత సంతతి నాలుగేళ్ల బాలిక

బొమ్మను ‘పెళ్లి’ చేసుకున్న బాడీ బిల్డర్, ఇప్పుడు విడాకులు ఇచ్చేశాడు.. ఇదో విచిత్ర స్టోరి….