- Telugu News Latest Telugu News Bodybuilder who went viral for marrying his doll reveals he is now divorced
బొమ్మను ‘పెళ్లి’ చేసుకున్న బాడీ బిల్డర్, ఇప్పుడు విడాకులు ఇచ్చేశాడు.. ఇదో విచిత్ర స్టోరి….
ఓ బాడీబిల్డర్ తనకు ఎవరూ తోడు లేరని అనుకున్నట్టున్నాడు. అందుకే ఒంటరిగా ఉండడం ఎందుకని వినూత్న ఆలోచన చేశాడు. మనుషులమీద నమ్మకం పోయిందేమో..
Updated on: Apr 11, 2021 | 7:30 PM

ఓ బాడీబిల్డర్ తనకు ఎవరూ తోడు లేరని అనుకున్నట్టున్నాడు. అందుకే ఒంటరిగా ఉండడం ఎందుకని వినూత్న ఆలోచన చేశాడు. మనుషులమీద నమ్మకం పోయిందేమో..ఏకంగా ఓ డాల్ (బొమ్మ) ను తెచ్చుకుని దాన్నే ‘పెళ్లి’ చేసుకున్నాడు. ఈ వెరైటీ బాడీ బిల్డర్ పేరు టోలోచోకో.. ‘ మార్గో’ అని తను ముద్దుగా పిలుచుకునే ఈ డాల్ తోనే ‘కాపురం’ వెలగబెట్టడం ప్రారంభించాడు.

2020 లో తను ఈ భార్య కాని భార్యకు ‘మూడు ముళ్ళూ’ వేశాడట. సిలికాన్ తో తయారైన ఈ బొమ్మను 2019 లోచూశానని, 2020 మార్చిలో ‘పెళ్లి’ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఈయన చెబుతున్నాడు. గత నవంబరులో ఈ వెరైటీ భార్యాభర్తల వెడ్డింగ్ సెరిమనీ సోషల్ మీడియాలో బాగానే సర్క్యులేట్ అయింది. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా తమ ‘పెళ్లి’ జరగడంలో జాప్యం జరిగిందని ఈయన తెలిపాడు.

మొత్తానికి 8 నెలలపాటు ఈ ‘విచిత్ర రిలేషన్ షిప్’ కొనసాగింది. ఒక రోజున ‘మార్గో’ విరిగిపోవడంతో దానికి మరమ్మతు అవసరమైంది. అది రిపేర్ షాపులో ఉండగా చేసేదేమీ లేక దాన్ని ‘ఛీట్’ చేశానని టోలోచోకో చెప్పుకున్నాడు. ఇక మరో డాల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి.. ‘లోలా’ అనే కొత్త ‘పిట్ట’ను పట్టాడు.

దీని గురించి తన కొత్త’భార్య’ గా వీడియోతో బాటు తన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేసి అందరికీ ఇంట్రొడ్యూస్ చేశాడు. ‘దిసీజ్ లోలా,లోలా క్వీర్’ అంటూ దాని గురించి మరిన్ని విశేషాలు తెలియజేశాడు.

‘మార్గో’ తో తన సంబంధాలు తెగిపోయాయని, ‘విడాకులకు’ కారణాలను తెలియజేయలేనని టోలోచోకో అంటున్నాడు. కేవలం ఒక్కరితో కొనసాగడం తన అలవాటులో లేదని, మళ్ళీ ‘మార్గో’ బ్రేక్ డౌన్ కావాలని తాను కోరడంలేదని చెప్పాడు
