Gopichand Thotakura: తొలి భారత అంతరిక్ష యాత్రికుడిగా గోపి తోటకూర రికార్డ్.. అభినందించిన వైఎస్‌ఆర్‌సీపీ

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. అంతరిక్షయానంతో చరిత్ర లిఖించాడు. ఇప్పటివరకు ఎంతోమంది విదేశీయులు వివిధ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ.. తెలుగువారు ఎవరూ అంతరిక్షంలో అడుగుపెట్టలేదు. ఆ లోటును తీర్చారు మన తెలుగు వ్యక్తి. గోపిచంద్‌ తోటకూర అనే వ్యక్తి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించాడు. అమెజాన్ […]

Gopichand Thotakura: తొలి భారత అంతరిక్ష యాత్రికుడిగా గోపి తోటకూర రికార్డ్.. అభినందించిన వైఎస్‌ఆర్‌సీపీ
Gopichand Thotakura
Follow us

|

Updated on: May 21, 2024 | 1:17 PM

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. అంతరిక్షయానంతో చరిత్ర లిఖించాడు. ఇప్పటివరకు ఎంతోమంది విదేశీయులు వివిధ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ.. తెలుగువారు ఎవరూ అంతరిక్షంలో అడుగుపెట్టలేదు. ఆ లోటును తీర్చారు మన తెలుగు వ్యక్తి. గోపిచంద్‌ తోటకూర అనే వ్యక్తి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించాడు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్-25 మిషన్‌లో పర్యాటకుడిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందినందుకు గోపి తోటకూరను ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అభినందించింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్ ట్విట్టర్ ‘X’లో ఒక పోస్ట్‌ చేస్తూ, విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ (గోపి) మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడుగా అవతరించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం” అంటూ వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది.

అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్‌ మిషన్‌లో భాగంగా ఆరుగురు సిబ్బందిలో తోటకూర గోపిచంద్ (30) ఎంపికయ్యారు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర చరిత్రకెక్కారు. స్పేస్‌ టూర్లకు ప్రఖ్యాతిగాంచిన బ్లూ ఆరిజిన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

విజయవాడకు చెందిన గోపిచంద్‌ తోటకూర అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రిజర్వ్‌ లైఫ్‌ అనే వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపిచంద్ కో ఫౌండర్‌గా ఉన్నారు. ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో గోపిచంద్‌ బీఎస్సీ పూర్తి చేశారు. గతంలో పైలట్‌గానూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బ్లూ ఆరిజిన్‌ మిషన్‌ ద్వారా అంతరిక్షయానంలో పాలు పంచుకున్నారు. అయితే.. బ్లూ ఆరిజిన్‌ అధికారికంగా ప్రకటించే వరకు అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు తన కుటుంబానికి తెలియదన్నారు గోపిచంద్‌. ఇక.. బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఇప్పటివరకు 6 మిషన్లలో 31 మందిని స్పేస్‌లోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్‌ లైన్‌ వరకు వెళ్లి తిరిగివచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త