Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు బెదిరింపు.. రోమ్‌కు మళ్లింపు!

న్యూయార్క్‌లోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం మధ్యలో బాంబు బెదిరింపు కారణంగా రోమ్‌కు అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చింది. 280 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు తన మార్గాన్ని మార్చుకుంది.

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు బెదిరింపు.. రోమ్‌కు మళ్లింపు!
American Airlines Flight
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 23, 2025 | 10:11 PM

అమెరికాలోని న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని అకస్మాత్తుగా రోమ్‌కు దారి మళ్లించారు. అమెరికన్ మీడియా ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపు కారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA292ను అత్యవసరంగా రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది.

విమానంలో పేలుడు పరికరం ఉందని సిబ్బందికి నిఘా సమాచారం అందింది. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎయిర్‌నావ్ రాడార్ ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం, విమానం అకస్మాత్తుగా మధ్యధరా సముద్రం మీదుగా తన మార్గాన్ని మార్చి అత్యవసర ల్యాండింగ్ కోసం రోమ్ వైపు మళ్లించారు. 280 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు తన మార్గాన్ని మార్చుకుంది.

భారత రాజధాని ఢిల్లీకి 14 గంటల ప్రయాణం కోసం శనివారం(ఫిబ్రవరి 22) రాత్రి 8:30 గంటలకు న్యూయార్క్ జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి AA292 విమానం బయలుదేరింది. అయితే, FlightRadar24 నుండి వచ్చిన రియల్ టైమ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, విమానం నల్ల సముద్రం మీదుగా నాటకీయంగా U-టర్న్ తీసుకుని, ఇటాలియన్ రాజధాని రోమ్ వైపు వెళ్లే ముందు పశ్చిమ దిశగా తన మార్గాన్ని తిరిగి ఎంచుకుంది. సమీప విమానాశ్రయంలో దిగకుండా, రోమ్‌కు మళ్లించాలనే నిర్ణయం ప్రశ్నలను తలెత్తుతున్నాయి. రోమ్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసర ల్యాండ్ చేశారు.

రోమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, స్థానిక పోలీసులతో సహా ఇటాలియన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానం విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, పరిస్థితిని అదుపు చేయడానికి ప్రత్యేక దళాలను మోహరించారు. యూరోపియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా పూర్తి అప్రమత్తమైంది. ఈమేరకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసింది. విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని ధృవీకరించారు. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

“న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA292 విమానంలో భద్రతా ముప్పు ఉన్నందున రోమ్‌కు మళ్లించడం జరిగింది. ప్రస్తుతం విమానంలో ఎలాంటి అవాంతరాలు సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదు. స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ప్రయాణీకుల సహనంతో సహకారించినందుకు అభినందలు” అంటూ అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణీకులను బయటకు తీసుకువెళ్లి తనిఖీ చేశారు. కార్గో హోల్డ్, ప్యాసింజర్ క్యాబిన్లతో సహా మొత్తం విమానాన్ని తనిఖీ చేయడానికి అధికారులు బాంబు డిటెక్టర్లను ఉపయోగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..