US Canada Kartika Pournami: కెనడాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయానికి పోటెత్తిన తెలుగు వారు..
US Canada Kartika Pournami: కెనడాలోని కాల్గరీలో కార్తీక పౌర్ణమి దీప వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అక్కడి తెలుగువారు. శ్రీ అనఘా దత్త సొసైటీ సాయిబాబా ఆలయం భక్తులతో కళకళలాడింది.
US Canada Kartika Pournami: కెనడాలోని కాల్గరీలో కార్తీక పౌర్ణమి దీప వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అక్కడి తెలుగువారు. శ్రీ అనఘా దత్త సొసైటీ సాయిబాబా ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆలయంలోని శివ, పార్వతి, సాయిబాబా మూర్తులకు అభిషేకం నిర్వహించారు. నాలుగు వందల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
కార్తీక మాసం సండడి కెనడాలోనూ కనిపిస్తోంది. కాల్గరీ నగరంలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆధ్వర్యంలో అక్కడి సాయి బాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామ స్మరణ కీర్తనలతో, ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వెయ్యికి పైగా దీపాలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలతో ప్రారంభమైన వేడుకలు.. మధ్యాన్నహారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతంతో పూర్తయ్యాయి. కాగా, ఈ కార్తీక పౌర్ణమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ నిర్వాహుకులు లలిత, శైలేష్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎంతో మంది వాలంటీర్లు సహకరించారు.
Also read:
శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..
Bike Loan: లోన్ తీసుకొని బైక్ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?