NRI: ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సులభంగా డీమ్యాట్‌ అకౌంట్‌ సేవలు.. పూర్తి వివరాలు..

NRI: సాధారణంగా షేర్‌ మార్కెట్లో వ్యాపారం చేయడానికి డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే డీమ్యాట్‌ సేవలు కేవలం భారత దేశంలో జరిగే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. మరి విదేశాల్లో..

NRI: ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సులభంగా డీమ్యాట్‌ అకౌంట్‌ సేవలు.. పూర్తి వివరాలు..
Nri Dmat Account
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 12, 2021 | 2:45 PM

NRI: సాధారణంగా షేర్‌ మార్కెట్లో వ్యాపారం చేయడానికి డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే డీమ్యాట్‌ సేవలు కేవలం భారత దేశంలో జరిగే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. మరి విదేశాల్లో నివసించే భారతీయులు, ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే పరస్థితి ఏంటి.? వీరికి డీమ్యాట్‌లాంటి సేవలు అందుబాటులో ఉండవు. ఒకవేళ డీమ్యాట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టాలంటే భారత్‌లో ఉన్న బ్రోకరేజ్‌ సంస్థలతో చేయించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే భారత్‌కు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్‌ సంస్థ జియోజిత్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్ట్రనల్‌ (ఎన్‌ఆర్‌ఈ), నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌ఓ) క్యాటగీరిల్లో ఉన్న ఇన్వెస్టర్స్‌ కోసం సెంట్రల్‌ డిపాజిటర్‌ సేవల ద్వారా డీమ్యాట్ అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకునే వెసులుబాటును కల్పించాయి.

ఎన్‌ఆర్‌, ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌ ఉన్న ఖాతాదారులు డీమ్యాట్‌ అకౌంట్‌ను కేవలం 5 నిమిషాల్లో తెరిచే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం వినియోగదారుదారులు hello.geojit.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, కెనెడాలో ఉన్న ప్రవాస భారతీయులు ఆన్‌లైన్‌లో ఈ సేవలను పొందే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఐలు ట్రేడింగ్‌ చేయాలంటే బ్రోకరేజ్‌ కంపెనీల మీద ఆధారపడేవారు. కానీ ఈ సంస్థ తీసుకొచ్చిన సేవలంతో నేరుగా ఎన్ఆర్‌ఐలు ఆన్‌లైన్‌లో ట్రెడింగ్ చేసుకునే అవకాశం దక్కింది.

ఈ విషయమై జియోజిత్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ జోన్స్‌ జార్జ్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌లో తొలిసారి జియోజిత్‌ ఎన్‌ఆర్‌ఈ, ఎన్ఆర్‌ఓ క్యాటగిరి అకౌంట్‌ హోల్డర్స్‌కు ఆన్‌లైన్‌ ట్రెడింగ్ అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మొబైల్ నెంబర్‌తో లింక్‌ చేసిన ఆధార్‌ కార్డ్‌తో పాటు పాన్‌ కార్డ్ ఉంటే సరిపోతుంది’ ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జియోజిత్ సంస్థకు సెప్టెంబర్‌ 30, 2021 నాటికి 11 లక్షల యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

Also Read: Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా కూల్.. స్వతహాగా అస్సలు కోపం తెచ్చుకోరు.!

Price Hike: కిరాణా..బట్టలు..ఎలక్ట్రానిక్స్..అన్ని వస్తువుల ధరలూ పెరగనున్నాయి.. ఎందుకో తెలుసా..

Biscuits Side Effects: టీతో కలిపి బిస్కెట్లు తింటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..