Mysterious Wall: బాబోయ్.. ఆ గోడ నిండా మృతదేహాలే.. ఏకంగా 2 కి.మీ. వరకు..
Mysterious Wall: ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. ప్యారీస్ అందాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే..
Mysterious Wall: ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. ప్యారీస్ అందాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలనిపిస్తుంటుంది. అయితే, ప్యారీస్‌లో కనులకు ఇంపైన ప్రదేశాలేకాదు.. వణుకు పుట్టించే మిస్టీరియస్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. సాదారణంగా గోడలను ఇటుకలు, రాళ్లతో నిర్మిస్తారు. మన కళ్లకు కనిపించేవి కూడా అవే. కానీ, ప్యారీస్‌లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర మృతదేహాలతో నిండిన ఓ గోడ ఉంది. ఆ గోడ మొత్తం మృతదేహాలే ఉంటాయి. ఆ గోడ ఏంది? మృతదేహాలు ఏంది? అసలు దీని కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..
‘ప్యారీస్ కాటకోంబ్స్’లో దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయట. దానికి తోడు భారీ వర్షాలతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేసేవారట. దాంతో అనతికాలంలోనే ఆ సొరంగం మృతదేహాలతో నిండిపోయిందట. ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారట. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ’ అని పిలుస్తారట. 800 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గోడను చాలా కాలం వరకూ పర్యాటకుల సందర్శనకు అనుమతించలేదట. అయితే ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
Also read:
Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!