AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATA Celebrations 2022: జోరుగా సాగుతున్న ‘ఆటా’ 17వ మహాసభల ఏర్పాట్లు.. ప్రముఖులతో మూడు రోజులపాటు సందడే సందడి..

అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటా సెలబ్రేషన్స్ కోసం.. ఎనభై కి పైగా కమిటీలు రేయింబగళ్లు కష్టపడుతున్నాయి.

ATA Celebrations 2022: జోరుగా సాగుతున్న 'ఆటా' 17వ మహాసభల ఏర్పాట్లు.. ప్రముఖులతో మూడు రోజులపాటు సందడే సందడి..
Ata Celebration 2022
Surya Kala
| Edited By: Team Veegam|

Updated on: Jul 04, 2022 | 11:05 AM

Share

ATA Celebrations 2022:  అమెరికా రాజధాని వాషింగ్టన్ డి. సి లో ఆటా పదిహేడవ మహాసభలని న భూతొ న భవిష్యతి అన్న విధంగా వందలమంది కళాకారులతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన , అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటా సెలబ్రేషన్స్ కోసం.. ఎనభై కి పైగా కమిటీలు రేయింబగళ్లు కష్టపడుతున్నాయి. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల , కన్వీనర్ సుధీర్ బండారు ,కోఆర్దినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్ కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ  సహా ఇతర కీలక సభ్యులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు.

అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే (Donars) అతిధులకు కోసం రవాణా, భోజన, హోటల్ వసతి ఏర్పాట్లు చేయడానికి ఒక సైన్యం రెడీ అవుతుంది. ఇప్పటి వరకూ లేని విధంగా ఈసారి మేరీల్యాండ్ లేదా వర్జీనియా నుంచి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వరకు షటిల్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నారు.

ఆటా మహాసభలకు మొట్టమొదటి సారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు)కి స్వాగతం చెప్పడానికి వేయికళ్లతో ఆటా సభ్యులు ఎదురు చూస్తున్నారు. “Daaji” కమలేష్ D.పటేల్ ప్రసంగం కోసం తెలుగు వారితో  వాళ్ళతో పాటు ఇతరులకు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మనం అందరం ఎంతో ఆరాధించే, ప్రేమించే, గౌరవించే ప్రముఖ కవులు, ప్రముఖ సినీ కళాకారులు, ఆంధ్ర , రాయలసీమ, తెలంగాణ నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రికెట్ లెజెండ్స్  కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్,  టి-20 , వన్ డే క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కళ్ళు జిగేల్ మనిపించే క్రిస్ గేల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. వీరిని కలవడానికి వారితో సంభాషించడానికి ఎంతో ప్రవాసాంధ్రులు ఎంతో ఉత్సుకతో వున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాస్ట్రో.. పద్మవిభూషణ్.. ఇళయరాజా సంగీత విభావరి, మెలోడీ కింగ్ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ , భీమ్లా నాయక్ , డి జె టిల్లు తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంపాదించి, సంచలనం సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్ కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్నీ  ప్రత్యేకతలతో.. భారీ సభ్యుల మధ్య ఆటా సైనికులతో పదిహేనువేలమంది సమక్షంలో జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకూ జరుపుకోబోయే ఆటా మహాసభలకు మీరందరు విచ్చేసి..  ఆతిధ్యం స్వీకరించి.. ఆనందించాల్సిందిగా ఆటా సభ్యులు కోరుతున్నారు.

ఆటా అంటే అమెరికాలోని తెలుగు వారందరిదని.. ఈ ఆటా 17వ మహాసభలు చరిత్ర లో నిలిచిపోయే విధంగా జరుగబోతుందని చెబుతున్నారు.  అమెరికాలో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆట ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి PROMO CODE:CATS ద్వారా $20 డిస్కౌంట్ జూలై 2,3 రోజులకు టికెట్స్ కు సహకారం ప్రకటించారు. అందరూ ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించికొని అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆటా 17వ మహాసభలు విజయవంతం చేయాలని కోరుకున్నారు. టికెట్స్ డిస్కౌంట్ లభించును. www.ataconference.org/buy-tickets మరిన్ని వివరాలకు www.ataconference.org సంప్రదించండి.

మరిన్ని గ్లోబల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..