Meteor fireball: భూమిపైకి దూసుకొచ్చిన భారీ ఉల్క.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
ఉల్కపాతం.. దీని గురించి మన తరచూ వింటూనే ఉంటాం. కానీ ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు ప్రజలకు షాక్ గురి చేసేలా ఉన్నాయి. అయితే ఉల్కగా భావించి భారీ ఫైర్‌బాల్...
ఉల్కపాతం.. దీని గురించి మన తరచూ వింటూనే ఉంటాం. కానీ ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు ప్రజలకు షాక్ గురి చేసేలా ఉన్నాయి. అయితే ఉల్కగా భావించి భారీ ఫైర్‌బాల్ అకాశం ఆకాశం నుంచి చైనా నేలపై కూలిపోయింది. డైలీ మెయిల్ నివేదించిన దాని ప్రకారం.. ఆకాశం నుంచి పడ్డ భారీ ఫైర్‌బాల్ సంఘటన బుధవారం చైనా కింగ్‌హై ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ భారీ ఉల్క భూమిపైకి దూసుకురావడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. దూసుకొచ్చిన ఈ భారీ ఫైర్‌బాల్ మండుతూ దూసుకొచ్చిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫైర్‌బాల్ చీకటిలో ఎగురుతూ దృశ్యాన్ని చూసినట్లు జియాన్ నుంచి లాసాకు వెళ్లే విమానంలో ఒక ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకున్నప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంత మంది నిపుణులు ఇది భారీ ఉల్క అని నమ్ముతున్నారు. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, గానీ ఇంకేదైనా నష్టం జరిగిందా..? లేదా అనే విషయమై ఖగోళ నిపుణులు గుర్తిస్తున్నారు.
అయితే ఇలా భూమిపైకి దూసుకొచ్చిన ఘటనను చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్ ధృవీకరించింది. అయితే భూమిపైకి భారీగా మంటలతో వ్యాపిస్తూ దూసుకువచ్చిన ఈ ఫైర్‌బాల్ కు సంబంధించిన సరైన కారణాలు గుర్తించలేదు. ఆకాశం నుంచి భారీ మంటలు వ్యాపిస్తూ భారీ శబ్దాలతో భూమిపైకి దూసుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
A super bright fireball stunned people living in west part of Qinghai and east part of Tibet in China at 7:23 this morning! pic.twitter.com/DskUwtBXuH
— Renjiang Xie (Jason )解仁江 (@JasonXie1977) December 23, 2020
A giant fireball has been spotted flashing across the sky and crashing into a county in southern #China.
Footage taken by stunned locals shows an unidentified object exploding into a blazing sphere as it plunges at a fast speed towards the earth. ? pic.twitter.com/DmAQDhkZ7G
— Mete Sohtaoğlu (@metesohtaoglu) December 23, 2020