Bhagavad Gita : భక్తి, జ్ఞాన, కర్మ యోగాలకు ఆలవాలం.. భగవద్గీతం, భారతదేశంలోనే కాదు, విదేశాలలోనూ శ్రద్ధాభక్తులతో గీతా జయంతి పర్వదినం
ఎల్లలులేని మానవ జీవిత సంపూర్ణ వికాస సాఫల్య గ్రంథమే భగవద్గీత. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు శ్రీమద్ భగవద్గీతను అర్జునుడినికి బోధించాడు....
Bhagavad Gita : ఎల్లలులేని మానవ జీవిత సంపూర్ణ వికాస సాఫల్య గ్రంథమే భగవద్గీత. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు శ్రీమద్ భగవద్గీతను అర్జునుడినికి బోధించాడు. అదే రోజును గీతా జయంతి జరుపుకుంటారు. మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథిలో ఈ గీత ఉనికిలోకి వచ్చింది. అందుకే ఇవాళ పవిత్ర భగవద్గీత గ్రంథం యొక్క 5157 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఇండియాలోనేకాదు, ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. మొత్తంగా 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీత గ్రంథంలో 700 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, తరువాత 6 అధ్యాయాలలో జ్ఞాన యోగం, చివరి 6 అధ్యాయాలలో భక్తి యోగం చెప్పబడింది. కలియుగం ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు, కురుక్షేత్ర మైదానంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించిన ఉపన్యాసం శ్రీమద్ భగవద్గీతగా ప్రసిద్ది చెందింది. గీతా జయంతి రోజున మోక్షాద ఏకాదశి కూడా వస్తుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన పూర్వీకులకు స్వర్గం యొక్క తలుపులు తెరుస్తాయని నమ్ముతారు. అంతేకాదు, మోక్షం పొందాలని కోరుకునే మానవులెవరైనా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని అంటారు.