Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం… రిక్టర్‌స్కేలుపై 6.3గా నమోదు…
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండోరో ప్రాంతంలో భూమి కంపించగా... భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది.
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. మిండోరో ప్రాంతంలో భూమి కంపించగా… భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 144 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.
భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపంతో ఫిలిప్పీన్స్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, ఆ దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ఆగస్టు నెలలో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.