Strain Virus: యూకే నుంచి విశాఖకు 211 మంది.. 167 మంది గుర్తింపు… వివరాలు ఆరా తీస్తున్న అధికారులు…
బ్రిటన్ నుంచి విశాఖపట్నానికి 211 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిలో 167 మందిని ఇప్పటికే గుర్తించారు.
Strain Virus: బ్రిటన్ నుంచి విశాఖపట్నానికి 211 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిలో 167 మందిని ఇప్పటికే గుర్తించారు. కాగా, నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు యూకే నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారి వివరాలను సైతం వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. అయితే రాజమండ్రికి చెందిన ఓ మహిళ విదేశాల నుంచి రాగా, ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెతో రైలులో ప్రయాణించి విశాఖకు చేరిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
సూచనలు…
బ్రిటన్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన అందరికి అధికారులు టెలీఫోన్ స్క్రీనింగ్ చేశారు. అయితే ఎవరు కూడా తమకు కరోనా లక్షణాలు కనిపించడం లేదని చెప్పడంతో అధికారులు అంతా ఊపిరి పీట్సుకున్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు, ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తే వెంటనే స్థానిక పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.