AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan – Joe Biden: ఆఫ్గన్‌లో పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు సరిగ్గా అంచనా వేయలేకపోయారా?

ఆఫ్గనిస్తాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నాడు చేసిన ప్రకటన, వేసిన అంచనా పూర్తిగా తప్పని తేలిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ ని స్వాధీన పరచుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన..

Afghanistan - Joe Biden: ఆఫ్గన్‌లో పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు సరిగ్గా అంచనా వేయలేకపోయారా?
Joe Biden
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 16, 2021 | 12:48 PM

Share

ఆఫ్గనిస్తాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నాడు చేసిన ప్రకటన, వేసిన అంచనా పూర్తిగా తప్పని తేలిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ ని స్వాధీన పరచుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. అది అసాధ్యమని అన్నారు. ఆఫ్ఘన్ దళాలు మూడు లక్షల వరకు ఉన్నారని, పైగా వారికీ యుద్ధ సామర్థ్యం ఉందని, ప్రపంచంలో మరే ఆర్మీకి లేనంత సత్తా కూడా వారి సొంతమని ఆయన చెప్పాడు. తాలిబన్ల సంఖ్య సుమారు 75 వేలు మాత్రమే అన్నారాయన.. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకోవడమన్నది కల్ల అని ఆయన కుండ బద్దలు కొట్టారు. కాబూల్ నగరంలో అమెరికా జాతీయ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుందని ధీమాగా చెప్పారు. వియత్నాం యుద్దానికి, దీనికి సంబంధం లేదన్నారు ఇది గత జులై 8 నాటి మాట.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. .అయితే నాటి ఆయన వ్యాఖ్యలకు, నేడు ఆఫ్ఘానిస్తాన్ లో జరిగిన పరిణామాలకు మధ్య ఎలాంటి పొంతన లేని విషయం గమనార్హం.

తాలిబన్లు వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. దేశంలో అనేక రాజధానులను, నగరాలను, జిల్లాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చి చివరకు ఈ నెల 15 న కాబూల్ నగరంలో ప్రవేశించారు. పలు చోట్ల ఆఫ్ఘన్ దళాలు వారికీ లొంగిపోవడమో, పారిపోవడమో జరిగింది. కేవలం కొన్ని వారాల్లోనే కాబూల్ నగరాన్ని వారు తమ వశం చేసుకున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ వదిలి పారిపోవలసి వచ్చింది. పైగా ఈ నగరాన్ని తాలిబన్లు కైవసం చేసుకోవడానికి సుమారు మూడు నెలలు పట్టవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వేసిన అంచనా కూడా తప్పని తేలిపోయింది. 3 నెలలు కాదు.. మూడు వారాల్లోనే వారు ఈ నగరంలో ఎలాంటి ఆటకం లేకుండా ప్రవేశించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Coronavirus India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Anurag Thakur: ‘2024 ఒలింపిక్ పతక విజేతలతో పోడియం నిండి పోవాలి.. మరింత విస్తృతంగా టాప్స్’: అనురాగ్ ఠాకూర్