Coronavirus India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న
Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. ఆదివారం కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 417 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. శనివారం నమోదైన కేసులతో.. పోలిస్తే.. 8.7శాతం కేసులు తక్కువగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,25,513 కి చేరగా.. మరణాల సంఖ్య 4,31,642 కి పెరిగింది.
తాజాగా ఈ మహమ్మారి నుంచి 32,937 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం కోలుకున్న వారిసంఖ్య 31,411924 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,81,947 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 1.19 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.48 శాతం, మరణాల రేటు 1.34శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54,58,57,108 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా ఆదివారం 17,43,114 మందికి వ్యాక్సిన్ అందించారు.
COVID19 | India reports 32,937 fresh cases, 417 deaths and 35,909 recoveries in the last 24 hours; active cases 3,81,947 pic.twitter.com/AGysBrq6HI
— ANI (@ANI) August 16, 2021
Also Read: