మేఘాలయాలో సీఎం నివాసంపై దాడులు..హోం మంత్రి రాజీనామా.. షిల్లాంగ్ లో 48 గంటల కర్ఫ్యూ
మేఘాలయలో ఒక్క సారిగా హింస చెలరేగింది. సీఎం కొన్ రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై నిన్న కొందరు పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఆయన తన అధికారిక నివాసంలో క్షేమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మేఘాలయలో ఒక్క సారిగా హింస చెలరేగింది. సీఎం కొన్ రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై నిన్న కొందరు పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఆయన తన అధికారిక నివాసంలో క్షేమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాజీ రెబెల్ నేత చెరిష్ స్టార్ ఫీల్డ్ మృతికి నిరసనగా పలువురు రాష్ట్రంలో దాడులు, హింసకు దిగారు. ఓ పోలీసు వాహనాన్ని, అందులోని ఆయుధాలను స్వాధీనం చేసుకుని దానికి నిప్పు పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి లక్ష్మణ్ రింబూ రాజీనామా చేశారు. చెరిష్ స్టార్ ఫీల్డ్ మృతిపై జుడీషియల్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి రాసిన తన రాజీనామా లేఖలో అయన కోరారు. తన రాజీనామా వల్ల నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. మాజీ రెబెల్ నేత చెరిష్ స్టార్ ఫీల్డ్ ఇంటిపై గత గురువారం పోలీసులు దాడి చేశారు. లైతుమ్ ఖేరా అనే ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో ఆయన ప్రమేయం ఉన్నట్టు తమకు ఆధారాలు లభించాయని. అందువల్ల ఆయన ఇంటిలో సోదాలు చేయడానికి రాగా పారిపోవడానికి యత్నిస్తు ఆయన కత్తితో తమపై దాడికి దిగాడని [పోలీసులు తెలిపారు. దీంతో తాము కాల్పులు జరపవలసి వచ్చిందన్నారు. ఆ ఘటనలో ఆయన మరణించాడు.
నిన్న జరిగిన ఈ రెబెల్ నేత అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్నారు. మరోవైపు షిల్లాంగ్ లో అనేక చోట్ల కొందరు ప్రభుత్వ వాహనాలపై రాళ్లు విసిరారు, అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ వాహనంపై జరిగిన రాళ్ళ దాడిలో ఆ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు కాగా ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న మేఘాలయ ఈ అల్లర్లతో ఇప్పుడు అట్టుడుకుతోంది. .
మరిన్ని ఇక్కడ చూడండి: నాడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెప్పిందేమిటి ? నేడు ఆఫ్గనిస్తాన్ లో జరిగిందేమిటి .?
Viral Pic: ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. కనిపెట్టగలరా.? చాలామంది గుర్తించలేకపోయారు.!