మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న వీరు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మహానేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు ఢిల్లీలోని వాజ్పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు.