Crime News: ఛీ.. ఛీ.. ఇలాంటి మహిళలు ఉంటారా..? యూపీలో దారుణ ఘటన..

Couple Booked Case: ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. స్థానికంగా ఉండే బాలికను తన ఇంటికి తీసుకెళ్లి తన భర్తతోనే అత్యాచారం చేయించింది. ఈ దారుణ సంఘటన

Crime News: ఛీ.. ఛీ.. ఇలాంటి మహిళలు ఉంటారా..? యూపీలో దారుణ ఘటన..
Girl Raped
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2021 | 10:01 AM

Couple Booked Case: ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. స్థానికంగా ఉండే బాలికను తన ఇంటికి తీసుకెళ్లి తన భర్తతోనే అత్యాచారం చేయించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని కౌశాంబి జిల్లా ప‌శ్చిమ స‌రీరా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీకి చెందిన మ‌హిళ.. స్థానికంగా ఉండే 14ఏళ్ల బాలిక‌ను ఇంటికి తీసుకెళ్లి త‌న భ‌ర్తతో అత్యాచారం చేయించింది. ఈ దారుణ ఘ‌ట‌న ఈ ఏడాది జ‌న‌వ‌రి 14న జ‌రిగింది. కాగా.. శనివారం బాధితురాలి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు, బాధితురాలి తల్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జ‌న‌వ‌రి 14న నిందితురాలు స్థానికంగా ఉండే 16 ఏళ్ల ద‌ళిత బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి త‌న ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం త‌న భ‌ర్తతో బలవంతంగా అత్యాచారం చేయించింది. నిందితుడు త‌న భార్య ముందే బాలిక‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంత‌రం ఈ విష‌యం బ‌య‌ట‌ చెబితే చంపుతామంటూ బాలికను బెదిరించి ఇంటికి పంపించారు. దాంతో భ‌య‌ప‌డిపోయిన బాలిక ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పకుండా ఇంతకాలం ఉంది.

అయితే.. ఈ మధ్య కాలంలో బాలిక ప్రవర్తనలో మార్పు గ‌మ‌నించిన త‌ల్లి గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో జ‌రిగిన విష‌యం మొత్తం చెప్పింది. దాంతో బాధితురాలి త‌ల్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కూడా ఈ విషయంపై ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నేరుగా కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు నిందితులైన దంపతులిద్దరిపై కేసులు న‌మోదు చేశారు. కాగా.. బాలిక‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

AP Crime News: కసాయి భర్త.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి..

Afghanistan Before and After: యూరోపియన్ స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ అలనాటి మహిళలు.. ఇప్పుడు ఇలా..