ఆఫ్గనిస్తాన్ లో మా ప్ట్రెండ్స్ ని తాలిబన్లు చంపేస్తారు.. ఇండియా చేరిన ఓ మహిళ ఆవేదన

ఆఫ్గనిస్తాన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని తాలిబన్లు చంపేస్తారని అక్కడి నుంచి ఇండియాకు చేరిన ఓ మహిళ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. కాబూల్ లో పరిస్థితి దుర్భరంగా ఉందంటూ కంట తడి పెట్టింది.

ఆఫ్గనిస్తాన్ లో మా ప్ట్రెండ్స్ ని తాలిబన్లు చంపేస్తారు.. ఇండియా చేరిన ఓ మహిళ ఆవేదన
Taliban Will Kill Us
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 16, 2021 | 12:48 PM

ఆఫ్గనిస్తాన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని తాలిబన్లు చంపేస్తారని అక్కడి నుంచి ఇండియాకు చేరిన ఓ మహిళ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. కాబూల్ లో పరిస్థితి దుర్భరంగా ఉందంటూ కంట తడి పెట్టింది. మొత్తం 129 మంది ప్రయాణికులతో కాబూల్ నుంచి భారతీయ విమానం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఆ నగరంలో మహిళలకు భద్రత లేదని, ఆఫ్ఘనిస్తాన్ ని ఈ ప్రపంచం ఎందుకు వదిలిపెట్టిందో తెలియదని ఆమె వాపోయింది. మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తారని ఆమె పేర్కొంది. అయితే కాబూల్ ఎయిర్ పోర్టుకు వస్తుండగా తాను ఎలాంటి హింసాత్మక ఘటనలను ఎదుర్కోలేదని సోనిని సర్కార్ అనే మరో మహిళ తెలిపింది. ఈమె అక్కడ ఓ ఎంజీవో సంస్థలో పని చేస్తోంది. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని మాజీ సలహాదారు రిజ్వానుల్లా అహ్మద్ జాయ్.. ఆఫ్ఘన్ లోని పరిస్థితిని వివరిస్తూ దేశంలో చాలాచోట్ల పరిస్థితి కామ్ గా ఉందన్నారు. మంత్రులు ఇతర రాజకీయ నాయకులు ప్రస్తుతం నగరంలో లేరన్నారు. సుమారు 200 మంది ఢిల్లీకి చేరుకున్నట్టు అయన చెప్పారు. మాజీ ఎంపీ హమీద్ కర్జాయ్, ఆయన బంధువు జమీల్ కర్జాయ్ వంటి పలువురు ఎంపీలు ఢిల్లీ చేరినవారిలో ఉన్నారు. ఘని ప్రజలకు ద్రోహం చేశారని, అతడిని క్షమించబోరని జమీల్ కర్జాయ్ ఆరోపించారు.

కాగా- గత వారం కాబూల్ నుంచి 20 మంది మాత్రమే ఇండియాకు చేరుకోగా నిన్న విమానం మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. తాను కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి రెండున్నర కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి తెలిపాడు. అటు-తాను నిన్నటివరకు ఎంపీనని..ఇప్పుడు మాజీ ఎంపీనైపోయానని అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి తెలిపారు. అయితే ఇండియాలో తనకు వ్యాపారం ఉందన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Childhood Pic: సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

Congress Party: కాంగ్రెస్‌‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు !