AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: కాంగ్రెస్‌‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు !

కాంగ్రెస్​పార్టీ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు.

Congress Party: కాంగ్రెస్‌‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు !
Kapil Sibal
Balaraju Goud
|

Updated on: Aug 16, 2021 | 12:23 PM

Share

Ex MP Sushmita Dev Resigns Congress: కాంగ్రెస్​పార్టీ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మరోవైపు పార్టీని పూర్తి స్థాయిలో చేయాల్సిందేనని సోనియా గాంధీకి జీ 23 అసమ్మతి నేతలు గతంలోనే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబాల్ తీవ్రంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా తన ప్రభావం కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, అసోం మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్‌ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌గా కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్‌ త్వరలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుస్మితా దేవ్‌ సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మార్చిలోనే సుస్మితా దేవ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల పట్ల అసంతృప్తిగా ఉన్న సుస్మితా దేవ్‌ పార్టీని వీడతారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ అధిష్టానం ఖండించింది.

ఇక, సుస్మితా దేవ్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ ఘాటుగా స్పందించారు. ‘‘సుస్ముతా దేవ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యువ నాయకులంతా పార్టీని వీడితున్నారు.. పార్టీని బలోపేతం చేయడానికి మేం సరిగా ప్రయత్నించడం లేదంటూ వృద్ధులపై నిందలు వేస్తున్నారు’’ అంటూ కపిల్‌ సిబాల్‌ విమర్శించారు. సుస్మితా దేవ్ రాజీనామా గురించి తనకు తెలియదని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా తెలిపారు. సుస్మితా దేవ్ అసోం కాంగ్రెస్ నాయకుడు ప్రభావవంతమైన బెంగాలీ నాయకుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టున్న సిల్చార్ సీటు నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ అధిష్టానం తీరుపై సీనియర్ నేతలు గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడం, ఆ తర్వాత పార్టీ బాధ్యతలను చేపట్టిన సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కాగా,గతంలోనే సీనియర్ నేత కపిల్ సిబాల్ పార్టీ అధిష్టానం తీరుపై స్ట్రాంగ్ ‌గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్​ పార్టీతోనే తాము ఉంటామని, ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం చేరబోనని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబాల్​ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని ఆయన బాధపడ్డారు. పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని సిబాల్​ వ్యాఖ్యానించారు. పార్టీలో సంస్కరణలలు అవసరమని, సీనియర్ల మాటల్ని నాయకత్వం ఇకనైనా వినాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అది నిజం. అవి పరిష్కారం అయ్యే వరకు వేలేత్తి చూపుతూనే ఉంటామన్నారు.

Read Also…   GST: జీఎస్టీ అంటే ఏమిటి.. ఇందులో మూడు రకాలు.. ఎవరి వాటా ఎంత.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!