Afghanistan – Taliban: ఆఫ్గన్ అధ్యక్ష భవనంలో తాలిబన్లు.. యుద్ధం ముగిసిందని ప్రకటన.. భయం గుప్పెట్లో కాబుల్

ఆఫ్గనిస్తాన్ లో యుద్ధం ముగిసిందని, ఇప్పుడిక ఈ దేశం తమ అధీనంలో ఉందని తాలిబన్లు ప్రకటించారు. అధ్యక్ష భవనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు.

Afghanistan - Taliban: ఆఫ్గన్ అధ్యక్ష భవనంలో తాలిబన్లు.. యుద్ధం ముగిసిందని ప్రకటన.. భయం గుప్పెట్లో కాబుల్
Talibans Declares War Is Over
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 16, 2021 | 1:08 PM

ఆఫ్గనిస్తాన్ లో యుద్ధం ముగిసిందని, ఇప్పుడిక ఈ దేశం తమ అధీనంలో ఉందని తాలిబన్లు ప్రకటించారు. అధ్యక్ష భవనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు.ఈ రోజు గొప్ప దినమని తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ నయీమ్ అన్నాడు. అల్లా దయతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అంతకు ముందే తాను తజికిస్తాన్ పారిపోతున్నట్టు ప్రకటించాడు. తాము శాంతి యుతంగా అధికార బదలాయింపును కోరుతున్నామని, ప్రత్యేకంగా ఈ దేశాన్ని పాలించాలని కోరుకోవడం లేదన్నారు.  అన్ని దేశాలనూ కలుపుకుని పోతామని, సమస్యలేవైనా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని మహమ్మద్ నయీం చెప్పాడు. ఆఫ్గన్‌లో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. షరియత్ చట్టాల కింద మహిళల హక్కులను గౌరవిస్తామని.. ప్రజల ఆస్తులకు హాని కలగకుండా చూస్తామని అన్నాడు. దేశంలోని మైనారిటీలకు తగిన స్వేచ్ఛ, రక్షణ కల్పిస్తామన్నాడు.

అటు ప్రజల ఆస్తులకు ముప్పు తేవద్దని తమ సేనలకు ఆదేశించినట్టు మరో అధికార ప్రతినిధి జహీబుల్లా ముజాహిద్ ట్వీట్ చేశాడు. శత్రువులు వదిలి పెట్టిన ప్రదేశాల్లో ప్రవేశించాలని, చోరీలు, దోపిడీలు జరగకుండా చూడాలని వారిని కోరినట్టు పేర్కొన్నాడు.

ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని సోషల్ మీడియా ద్వారా సందేశాలు సర్క్యులేట్ అయ్యాయి. ఏమైనా… మళ్ళీ తాలిబన్లు ఇదివరకు మాదిరే క్రూర పాలన ప్రారంభిస్తారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు స్కూళ్లకు, మహిళలు పని ప్రదేశాలకు వెళ్లరాదన్న నిబంధనలు ఇదివరకు ఉండేవి. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యమే ఉండేది. ఇస్లాం చట్టాలను ఉల్లంఘించిన మహిళలను రాళ్లతో కొట్టి గానీ, కొరడా దెబ్బల శిక్షలు విధించి గానీ హతమార్చేవారు. కొందరిని ఉరి తీసేవారు. బయటకు వచ్చినప్పుడల్లా మహిళలు తప్పనిసరిగా బుర్ఖా ధరించాలన్న నిబంధన కూడా ఉంటూ వచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ లో మా ప్ట్రెండ్స్ ని తాలిబన్లు చంపేస్తారు.. ఇండియా చేరిన ఓ మహిళ ఆవేదన

Childhood Pic: సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..