Sebastian Vettel: రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలను బహిష్కరిస్తున్నా.. ఫార్ములా రేసర్ సంచలన నిర్ణయం
ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలను బహిష్కరిస్తున్నట్లు ఫార్ములా వన్ ఛాంపియన్ సెబాస్టియన్ వెటెల్ అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడికి నిరసనగా ఈ నిర్ణయం...

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలను బహిష్కరిస్తున్నట్లు ఫార్ములా వన్ ఛాంపియన్ సెబాస్టియన్ వెటెల్ అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సరైన కారణాలు లేకుండా రష్యా యుద్ధం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలను అమానుషంగా తీసేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం లేచిన తరువాత ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిందన్న వార్త విని షాక్ అయ్యాను. ఏం జరుగుతుందో చూడటం భయంకరంగా ఉంది. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. సెప్టెంబర్ 25 న రష్యాలో రేసు జరగాల్సి ఉంది. ఆ రేసుకు నేను వెళ్లకూడదని అనుకుంటున్నాను. ఇది నా స్వంత అభిప్రాయం, తెలివితక్కువ కారణాలతో, విచిత్రమైన నాయకత్వం కోసం ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. -సెబాస్టియన్ వెటెల్, ఫార్ములా వన్ రేసర్
ఉక్రెయిన్లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేస్తున్నామన్నారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చరికలు చేశారు. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే.. ‘ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read
CC TV Video: కొంప ముంచిన అత్యుత్సాహం.. బైకు తుక్కు తుక్కు… నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
త్వరగా బరువు తగ్గడానికి ఈ నూనె ఒక్కటి చాలు.. వ్యాయామం అవసరమే ఉండదు..!