CC TV Video: కొంప ముంచిన అత్యుత్సాహం.. బైకు తుక్కు తుక్కు… నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
కొన్నిసార్లు మనం చేసే పనులు ప్రాణాలమీదకి తెస్తాయి.. బాధ్యతారాహిత్యం, అత్యుత్సాహం ఎప్పటికైనా ప్రమాదమే అని మరోసారి రుజువువతుంది ఈ ఘటన చూస్తే... ఇక్కడ ఓ యువకుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు..
కొన్నిసార్లు మనం చేసే పనులు ప్రాణాలమీదకి తెస్తాయి.. బాధ్యతారాహిత్యం, అత్యుత్సాహం ఎప్పటికైనా ప్రమాదమే అని మరోసారి రుజువువతుంది ఈ ఘటన చూస్తే… ఇక్కడ ఓ యువకుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.. ముంబయిలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబయిలోని ఓ ప్రాంతంలో వీధి గుండా రైలు వెళ్తోంది. దీంతో అధికారులు గేట్ వేశారు. అయితే కొందరు గేటు కింది నుంచి దూరుతూ ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ఓ కుర్రాడు బైక్‌ను గేటు కింది నుంచి తీసి ట్రాక్ దాటాలని ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రైలు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. దీంతో ట్రాక్ దగ్గర వరకూ వెళ్లిన కుర్రాడు, మనసు మార్చుకొని వెనక్కి వచ్చేద్దామనుకుకుని బైకుని వెనక్కి మళ్లిస్తున్నాడు.. ఈ క్రమంలో అదుపు తప్పడంతో బైక్ కింద పడిపోయింది. ట్రాక్‌కు దగ్గరపడడంతో వేగంగా వచ్చిన రైలు బైక్ చివర్లను ఢీకొట్టింది. దీంతో ఆబైక్ తుక్కుతుక్కు అయిపోయింది. బైక్‌ను వెనక్కి లాగుదామని ప్రయత్నించినా రైలు అత్యంత వేగంతో దూసుకురావడంతో ఆ పని కూడా చేయలేకపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అత్యుత్సాహం ఎప్పటికైనా అనర్థమే అంటూ ఆ కుర్రాడికి హితవు పలుకుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

