Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: అలా అయితే స్టార్ లింక్ సేవలు ఇవ్వం.. కీలక నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే యుద్ధంతో దద్దరిల్లిపోతున్నటువంటి ఉక్రెయిన్‌తు స్పెస్ ఎక్స్ యజమాన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఉక్రెయన్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్ ఎలాన్ మస్క్‌ను ఇటీవల ఓ సాయం కోరింది. తమకు వెంటనే స్టార్ లింక్ సేవలను అందించాలని కోరింది.

Elon Musk: అలా అయితే స్టార్ లింక్ సేవలు ఇవ్వం.. కీలక నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్
Elon Musk
Follow us
Aravind B

|

Updated on: Sep 08, 2023 | 2:00 PM

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే యుద్ధంతో దద్దరిల్లిపోతున్నటువంటి ఉక్రెయిన్‌తు స్పెస్ ఎక్స్ యజమాన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఉక్రెయన్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్ ఎలాన్ మస్క్‌ను ఇటీవల ఓ సాయం కోరింది. తమకు వెంటనే స్టార్ లింక్ సేవలను అందించాలని కోరింది. అయితే దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. అత్యవసరంగా ఉక్రెయిన్‌కు స్టార్ లింక్ సేవలు అందించాలన్న ఆ దేశ విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. ఒకవేళ ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తికి ఆమోదం తెలిపితే.. ఇది రష్యా,ఉక్రెయన్ మధ్య యుద్ధానికి పెద్ద కవ్వింపు చర్యగా మారుతుందని ఎలాన్ వెల్లడించారు. అలాగే దీనివల్ల సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఒక ఎక్స్ (ట్విట్టర్) వినియోగదారుడు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్ రష్యాపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో.. స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌ సేవలను వెంటనే నిలిపివేయాలని తన కంపెనీ ఇంజినీర్లకు మస్క్ రహస్యంగా సూచనలు చేశారు. అలాగే రష్యా నౌకదళంపై ఉక్రెయిన్ అకస్మాత్తుగా చేసినటువంటి దాడిని అడ్డుకునేందుకే ఇలా చేశారు. కానీ ఉక్రెయిన్ మాత్రం మళ్లీ స్టార్ లింక్ సేవలను పునరుద్ధరించాలని ఎలాన్ మస్క్ ను ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. కానీ.. ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ఆ దాడికి ప్రతిగా రష్యా అణ్వాయుధాలతో స్పందించే అవకాశం ఉంటుందని.. ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారని.. ఆ ట్విట్టర్ వినియోగదారుడు వివరించాడు. అలాగే ఈ వ్యాఖ్యలపై మస్క్ సైతం స్పందించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో స్టార్ లింక్‌ను యాక్టివేట్ చేయలేదని చెప్పారు. అలాగే వేటిని కూడా స్పేస్ ఎక్స్ డీయాక్టివేట్ చేయలేదని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే అత్యవసరంగా సెవస్తపోల్ ప్రాంతం వద్ద స్టార్ లింక్‌నను యాక్టివేట్ చేయాలని ఉక్రెయిన్ నుంచి అభ్యర్ధ వచ్చింది నిజమేనని అంగీకరించారు. అయితే అక్కడ రష్యా నౌకలను ముంచాలనే ఉద్దేశంతోనే అలా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ చేసినటువంటి విజ్ఞప్తిని తాను అంగీకరించనట్లైతే.. స్టార్ లింక్ ఓ పెద్ద కవ్వింపబు చర్యకు సహకరించినట్లవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని ఇప్పటికే కమ్యూనికేషన్ నెట్‌వర్క్ దెబ్బతింది. అయితే కీవ్ మాత్రం చాలావరకు శాటిలైట్ కమ్యూనికేషన్లపైనే ఆధారపడి ఉంది. మరో విషయం ఏంటంటే వీటి సహాయంతోనే బలగాలకు సమాచారం, సూచనలు పంపిస్తోంది. ఇదిలా ఉండగా ఇతరుల సహకారంతో స్పేస్ ఎక్స్..2022 నుంచి ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్