Rare Sight in Sky: ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఇప్పుడు మిస్సయితే మళ్లీ 400 ఏళ్ల తర్వాతే..

Rare Sight in Sky: ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఇప్పుడు మిస్సయితే మళ్లీ 400 ఏళ్ల తర్వాతే..

Anil kumar poka

|

Updated on: Sep 08, 2023 | 5:25 PM

ఆకాశంలో ఓ అరుదైన తోకచుక్క భూమికి సమీపంగా రానుంది. నిషిమురా అనే ఈ తోకచుక్క సెప్టెంబర్‌ 12న ఆకాశంలో ఈశాన్యం దిక్కున దర్శనం ఇవ్వనుంది. ఈ తోకచుక్కను ఆగస్టు 12న జపాన్‌ శాస్త్రవేత్త హిడియో నిషిమురా తొలిసారి దీన్ని కనుగొన్నారు. ఇది కిలోమీటర్ పరిమాణంలో ఉంటుంది. భూమికి 80 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ నెల 12న ఇది వెళ్లనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారికి ఇది స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆకాశంలో ఓ అరుదైన తోకచుక్క భూమికి సమీపంగా రానుంది. నిషిమురా అనే ఈ తోకచుక్క సెప్టెంబర్‌ 12న ఆకాశంలో ఈశాన్యం దిక్కున దర్శనం ఇవ్వనుంది. ఈ తోకచుక్కను ఆగస్టు 12న జపాన్‌ శాస్త్రవేత్త హిడియో నిషిమురా తొలిసారి దీన్ని కనుగొన్నారు. ఇది కిలోమీటర్ పరిమాణంలో ఉంటుంది. భూమికి 80 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ నెల 12న ఇది వెళ్లనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారికి ఇది స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు దీనిని మిస్సయితే మళ్లీ ఇప్పట్లోదీన్ని చూడలేరంటున్నారు. ఎందుకంటే మళ్లీ 400 ఏళ్ల తర్వాతే ఇది భూమికి సమీపంగా వస్తుంది. నేరుగా కంటితో కాకుండా బైనాక్యులర్ సాయంతో దీన్ని స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశంలో ఇది ఉన్న స్థానం దృష్టా నేరుగా కంటితో చూస్తే అస్పష్టంగా అనిపిస్తుంది. తెల్లవారుజాము సమయంలో, సూర్యోదయానికి అరగంట ముందు ఈశాన్య దిక్కున నింగివైపు చూస్తే ఈ తోక చుక్క కనిపిస్తుంది. సూర్యుడికి చేరువ అయ్యే కొద్దీ ఇది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. కానీ, భూమి పైనున్న వారికి కనిపించదు. మంచి బైనాక్యులర్ సాయంతో కచ్చితమైన దిశలో చూస్తే ఇది కనిపిస్తుందని నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ మేనేజర్ పౌల్ చోడాస్ సూచించారు. సెప్టెంబర్ 17న సూర్యుడికి ఇది చేరువగా వెళుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..