Crime Video: భర్తలు పెద్దాఫీసర్లు.. భార్యలు దారి తప్పిన కిలేడీలు..! వీడియో..

Crime Video: భర్తలు పెద్దాఫీసర్లు.. భార్యలు దారి తప్పిన కిలేడీలు..! వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 08, 2023 | 5:36 PM

ఇక్కడ కనిపిస్తున్న మహిళల భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి సరిపడా ఆదాయం ఆర్జిస్తున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ ఆ వివాహితలు రూటు మార్చారు. భర్తల సంపాదన కన్నా ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి ఎంచుకున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రెండు సార్లు సక్సెస్‌ అయ్యారు. వీళ్లు చేసిన చిన్న పొరపాటు మూడోసారి పోలీసులకు చిక్కేలా చేసింది.

ఇక్కడ కనిపిస్తున్న మహిళల భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి సరిపడా ఆదాయం ఆర్జిస్తున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ ఆ వివాహితలు రూటు మార్చారు. భర్తల సంపాదన కన్నా ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి ఎంచుకున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రెండు సార్లు సక్సెస్‌ అయ్యారు. వీళ్లు చేసిన చిన్న పొరపాటు మూడోసారి పోలీసులకు చిక్కేలా చేసింది. దీంతో ప్రస్తుతం కటకటాలపాలై ఊచలు లెక్కబెడుతున్నారు. ఒంగోలులో కొత్త తరహా నేరాలకు తెరలేపారు నలుగురు మహిళలు. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే బ్యూటీపార్లర్లపై కన్నేశారు. అందుకు అనువుగా ఉన్న ఒంగోలులోని క‌‌ృష్ణానగర్ ప్రాంతానికి చెందిన ఓ బ్యూటీపార్లర్‌ను ఎంచుకున్నారు. బ్యూటీ పార్లర్‌ నిర్వహకురాలు రజియాను దోచుకునేందుకు ఫిక్స్ అయ్యారు.

మరో బ్యూటీపార్లర్‌ నిర్వహకురాలు దాసరి భాను సాయంతో పక్కా ప్లాన్‌‌తో యాక్షన్‌లో దిగారు. రజియాపై బాత్రూమ్‌ యాసిడ్‌తో దాడి చేసి, మత్తుమందు ఇచ్చి బంగారం, నగదు ఎత్తుకెళ్ళారు. అయితే ఇక్కడ ఈ మహిళలు చేసిన ఓ పొరపాటు గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా చేసింది. దీంతో ఈ ముగ్గురి గుట్టు రట్లయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు బ్యూటీషియన్‌ దాసరి భానును అదుపులోకి తీసుకోవడంతో ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ తెలిసిపోయింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలను గమనించకుండా కస్టమర్లుగా ఎంట్రీ ఇవ్వడంతో దొరికిపోయారు. నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులైన ముగ్గురు మహిళలు ముండ్రు లక్ష్మి నవత, కరణం మోహన దీప్తి, అలహరి అపర్ణలతో పాటు ఈ చోరీకి ప్లాన్‌ చేసిన మరో బ్యూటీషియన్‌ దాసరి భానును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 సవర్ల బంగారు నగలు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి మలికగార్గ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..