Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Earthquake: చైనాను వణికిస్తున్న వరుస భూకంపాలు.. అర్ధరాత్రి మళ్లీ ప్రకంపనలు..

Earthquake in China: చైనాలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఉయ్‌గుర్‌ ప్రోవిన్స్‌ జీన్‌జీయాంగ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జాంగుయ్‌ టౌన్‌షిప్‌, షాచే కౌంటీ

China Earthquake: చైనాను వణికిస్తున్న వరుస భూకంపాలు.. అర్ధరాత్రి మళ్లీ ప్రకంపనలు..
Earthquake
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2021 | 9:03 AM

Earthquake in China: చైనాలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఉయ్‌గుర్‌ ప్రోవిన్స్‌ జీన్‌జీయాంగ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జాంగుయ్‌ టౌన్‌షిప్‌, షాచే కౌంటీ ప్రాంతాల్లో శనివారం ఉదయం 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. వీటినుంచి తేరుకోక ముందే.. తాజాగా యెచెంగ్‌ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున 1.52 గంటలకు భూకంపం వచ్చినట్లు చైనా వెల్లడించింది. ఈ భూకపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదయిందని చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ (సీఈఎన్‌సీ) ప్రకటించింది. కాగా.. శనివారం ఉదయం 6.58 గంటలకు జాంగుయ్‌ టౌన్‌షిప్‌లో 4.6 తీవ్రతతో, 7.24 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు సీఈఎన్సీ తెలిపింది. భూకంప కేంద్రాలు జాంగ్‌గుయ్ కు 87 కిలోమీటర్లు, షాచే కౌంటీ ప్రాంతానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చైనా అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్లనుంచి పరుగులు తీశారు.

కాగా.. ఆగస్టులో హైతీలో ఘోరమైన భూకంపం సంభవించింది. 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 2,207 మంది ప్రజలు మరణించారు. ఇంకా 344 మంది ఆచూకీ ఇంతవరకూ లభించలేదని హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది.

Also Read:

Suicide: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పెళ్లైన పది నెలలకే.

Crime News: దారుణం.. టీవీ మీద పడి పసిపాప మృతి.. ఆడుకుంటుండగా..

Gold smuggling: విజయవాడ పోలీసుల అదుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా.. వాయు, జల మార్గాల ద్వారా రవాణా