Crime News: దారుణం.. టీవీ మీద పడి పసిపాప మృతి.. ఆడుకుంటుండగా..
TV fell on Child: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృతిచెందింది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని
TV fell on Child: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృతిచెందింది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని నందిగామ మండలం పాత కంచల గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… చలమల నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కీర్తి (11 నెలలు). శనివారం చిన్నారి కీర్తి ఇంట్లో ఆడుకుంటూ టీవీ ముందు కూర్చుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి బయట కూర్చొని ఉన్నారు. అయితే.. చిన్నారి టీవీ పక్కనే కూర్చొని.. చేతికి అందిన టీవీ కేబుల్‌ను గట్టిగా లాగింది. దీంతో టీవీ ఆమెపై పడింది. శబ్దం రావడంతో వెంటనే గమనించిన తల్లిదండ్రులు పాపను ఐతవరం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అయితే.. పాప అప్పటికే మృతి చెందినట్లు ఆర్‌ఎంపీ తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
త్వరలో కీర్తి తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో తమ పసిపాప అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. చిన్నారి తల్లి సౌందర్య ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read: