Golden Chance: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. ఇదే గోల్డెన్ ఛాన్స్..87 రూపాయలకే ఇళ్లు..!
అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? ఎంత చౌక అంటే.. కేవలం 87 రూపాయలకే ఇళ్లు కొనుక్కోవచ్చు.
Cheapest House in Italy: సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కరి కల..అయితే, ఇళ్లు కొనాలన్నా.. కట్టలన్నా చాలామందికి భారీ బడ్జెట్‌తో కూడుకున్న పని..అందుకోసం.. అప్పులు చేయాల్సిన పరిస్థితి.. బ్యాంక్ లోన్ తీసుకున్నా బయట అప్పు చేస్తే కానీ కొనే పరిస్థితి లేదు ఈ రోజుల్లో.. కానీ ఇలాంటి సమయంలో అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? ఎంత చౌక అంటే.. కేవలం 87 రూపాయలకే ఇళ్లు కొనుక్కోవచ్చు. అత్యంత అందమైన నగరంలో అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. నమ్మడం కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమేనండోయ్…ఇంతకీ అంత, చౌకైన, అందమైన ఆ ఇండ్లు ఎక్కడ అనే కదా మీ సందేహం.. అయితే, స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఇటలీలోని బిసాసియా అనే అందమైన టౌన్ ఉంది. ఇది రోమ్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టౌన్‌లో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే.. అక్కడ 90 శాతం వరకు ఇళ్లు చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో అందమైన ఈ నగరం ఇప్పుడు ఎవరు నివసించక బోసిపోయింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ టౌన్ ఇళ్లల్లో జనాభా నివాసముండేలా ప్రోత్సహించేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఒకప్పటి నగరంలా అభివృద్ధి చేసేందుకే ఇలా విక్రయిస్తున్నామని పట్టణం డిప్యూటీ మేయర్ ఫ్రాన్సిస్కో టార్టాగ్లియా తెలిపారు.
ఈ ఊరు ఒకప్పుడు ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. 1968లో వచ్చిన భూకంపం ప్రభావం ఈ ఊరిపై చాలా పడింది. ఆ తరువాత చాలా మంది ఇతర పట్టణాలకు తరలి వెళ్లారు. దాంతో ఊరంతా ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ ఊళ్లో అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఊరు జనంతో నిండిపోయేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకు వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే ఇండియన్ కరెన్సీలో 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటలోనూ పాల్గొనవచ్చు. అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని ఎలా ఉపయోగిస్తారో చేసి చూపించాలి.
Read Also… Wine Shops: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో మరో 200 వైన్స్ షాపులకు గ్రీన్ సిగ్నల్!