AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine Shops: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో మరో 200 వైన్స్ షాపులకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే క్రమంలో మరిన్ని మద్యం షాపులను పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Wine Shops: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో మరో 200 వైన్స్ షాపులకు గ్రీన్ సిగ్నల్!
Balaraju Goud
|

Updated on: Aug 24, 2021 | 1:28 PM

Share

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే క్రమంలో మరిన్ని మద్యం షాపులను పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఇప్పుడున్న 2,216 వైన్స్ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. మద్యం షాపులకు వేలం తప్పని సరిగా జరిగి తీరుతుంది. దీంతో కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.

ఇందుకోసం ప్రభుత్వంలోని ఎక్సైజ్ విభాగం.. కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్ చివరి నాటికి తేవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే.. అదనంగా మరో 200 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవల కొత్తగా 80 బార్లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, కానీ, రకరకాల కారణాలతో అవి ప్రారంభం కాలేదు. దీని కరోనా తోడవడంతో బార్‌లు తెరిచేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. అయితే, లిక్కర్ షాపుల విషయంలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… లిక్కర్ షాపుల సంఖ్యను ప్రభుత్వం ఏనాడూ పెంచలేదు. ఏడేళ్లుగా అవే షాపులకు టెండర్లు నిర్వహిస్తోంది. జనాభా పెరగడంతో పాటు షాపుల సంఖ్యను కూడా పెంచితే బాగండని అధికారులు ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. కొత్త షాపులను కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, కొత్త ఏరియాల్లో ఓపెన్ చెయ్యాలన్నది అధికారుల ప్రతిపాదన. ఎక్కడైతే తరచూ మేళాలు, వేడుకలు, పండుగలు, ఫంక్షన్లు, కార్యక్రమాల వంటివి తరచూ జరుగుతూ ఉంటాయో.. అలాంటి చోట కొత్త లిక్కర్ షాపులను తెరవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

రెవెన్యూ పెంచుకునేందుకు ఈసారి లిక్కర్ షాపుల వేలం లైసెన్స్ ఫీజును కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అదనంగా రూ.1,200 కోట్ల రెవెన్యూ రాబట్టాలనే టార్గెట్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9,000 కోట్ల ఆదాయం వస్తోంది. 2015-2017 వేలంలో… అప్లికేషన్ ఫీజు రూ.50,000 ఉంది. ఆ తర్వాతి రెండేళ్లకు జరిగిన వేలంలో ఆ ఫీజును రూ.లక్ష చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని రూ.3లక్షలు చెయ్యాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మద్యం షాపుల ఓనర్లు ఎలా ఫీలవుతారు. మద్యం ధరలు పెంచకుండా… ఫీజు ధర పెంచితే వారు ఒప్పుకుంటారా అనే దానిపై ప్రభుత్వం చర్చించుకుంటోంది.

అధికారులు చెబుతున్న దాని ప్రకారం… తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ షాపుల లైసెన్సింగ్ ఫీజ్ కూడా పెంచబోతోందని తెలిసింది. ప్రస్తుతం ఈ ఫీజు నాలుగు స్లాబుల్లో ఉంది. అంటే రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, రూ.80 లక్షలు, రూ.1.20 కోట్లు. ఈ ఫీజులను 5 శాతం నుంచి 8 శాతం పెంచాలి అనే ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం.. లైసెన్స్ ఫీజును 5 శాతం పెంచితే అప్పుడు ఫీజు రూ.47.50 లక్షలు, రూ.52.50 లక్షలు, రూ.84లక్షలు, రూ.1.26 కోట్లు అవ్వగలదు. ఇవన్నీ అంచనాలు మాత్రమే… పెంచుతుందా లేదా అన్నది అప్పుడే కచ్చితంగా చెప్పలేం అని కూడా అధికారులు అంటున్నారు.

Read Also… Zodiac Signs: జాతక రీత్యా ఈ రాశుల వారి వ్యవహారశైలి చాలా కఠినంగా ఉంటుంది.. ఒక్కోసారి భరించలేనిదిగా కూడా ఉంటుంది.. ఏ రాశుల వారో తెలుసుకోండి!