Diwali: వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు.. భారతీయ సంప్రాదయ దుస్తులతో 200 మంది అతిధుల సందడి

దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరంగా భావిస్తున్నానని’’ బైడెన్‌ తెలిపారు

Diwali: వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు.. భారతీయ సంప్రాదయ దుస్తులతో 200 మంది అతిధుల సందడి
Diwali At White House
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2022 | 11:52 AM

దీపావళి పర్వదినాన అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.  జార్జ్ బుష్ పరిపాలనలో పీపుల్స్ హౌస్ పండుగను జరుపుకోవడం ప్రారంభించినప్పటి ..  వైట్‌హౌస్‌ చరిత్రలోనే భారీస్థాయిలో దీపావళి వేడుకలను నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సమక్షంలో వైట్ హౌస్‌లో సోమవారం దీపావళి వేడుకలను ఘనంగా  నిర్వహించారు. జో బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్ తో కలిసి వైట్ హౌస్ లో దీపావళి విందు ఏర్పాటు చేశారు. .‘‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు చాలా మది ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరంగా భావిస్తున్నానని’’ బైడెన్‌ తెలిపారు. యూఎస్‌లోని భారతీయులు, భారత సంతతికి చెందినవారితో పాటు పలువురు అమెరికన్లు కూడా ఈ దీపాల పండుగను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

‘ఈ వైట్‌ హౌస్‌ అందరిదీ అని, ఇక్కడ అన్ని జాతుల వారు.. అధ్యక్షుడి కుటుంబతో కలిసి వారివారి పండుగలను నిర్వహించుకోవచ్చన్నారు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌. 100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్‌ కార్యవర్గం దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైందన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అతిధులు చీరలు, లెహంగాలు , షేర్వాణీలు వంటి భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

“దీపావళి మనలో ప్రతి ఒక్కరికీ చీకటిని పారద్రోలి, ప్రపంచానికి వెలుగుని అందించే శక్తి ఉందని గుర్తుచేస్తుంది. ఈ రోజు వైట్‌హౌస్‌లో ఈ సంతోషకరమైన సందర్భాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది” అని బిడెన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?