Rishi Sunak: రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఫ్యాషన్ డిజైనర్.. వారి జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ కొత్త..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి పదవి రేసు నుండి బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ వైదొలిగిన తర్వాత రిషి సునక్ పేరును అధికారికంగా ప్రధానమంత్రి పదవికి ప్రకటించారు. ఇప్పుడు ఆయన బ్రిటన్ కొత్త ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. రిషి సునక్ కుటుంబం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సునక్ వాస్తవానికి పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలా జిల్లాకు చెందినవారు. ఇప్పుడు ఈ స్థలం పాకిస్థాన్‌లో ఉంది. అతని తాతలు ఈ జిల్లాలోనే జన్మించారు. అతను పంజాబీ ఖత్రీ కుటుంబానికి చెందినవాడు. ఆ సమయంలో దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారు. రిషి తాత రాందాస్ సునక్ 1935లో కెన్యా రాజధాని నైరోబీలో క్లర్క్ ఉద్యోగం కోసం గుజ్రాన్‌వాలాను విడిచిపెట్టి కుటుంబంతో సహా అక్కడికి మారారు. అక్కడే సునక్ తండ్రి యశ్వీర్ జన్మించాడు. అతని తల్లి ఉష భారతదేశం నుండి టాంజానియాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన కుటుంబం.
ఆ తరువాత అతని కుటుంబం బ్రిటన్‌కు మారింది. అక్కడ సునాక్ 12 మే 1980న సౌతాంప్టన్‌లో జన్మించాడు. రిషి తండ్రి యశ్వీర్ సునక్ రిటైర్డ్ డాక్టర్. అతని తల్లి ఉషా సునక్ ఫార్మసిస్ట్. రిషి సునక్ ముగ్గురు సోదరీమణులు. సోదరులలో పెద్దవాడు. అతను యూకేలోని వించెస్టర్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్ చదివాడు. దీనితో పాటు, అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్ నుండి ఎంబీఏ డిగ్రీని పొందాడు. ఇక సునక్ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో 7 మిలియన్ పౌండ్ల ఐదు పడకగదుల ఇల్లుతో సహా నాలుగు అంతస్తుల భవనం ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో వీరికి ఫ్లాట్ కూడా ఉంది. రిషి సునాక్ ఇంతటీ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేసిన వ్యక్తి భార్య అక్షతా మూర్తి.
సునాక్ భార్య ఫ్యాషన్ డిజైనర్:
సునక్ అత్తసుధ మూర్తి.. ఆమె టాటా మోటార్స్ తొలి మహిళా ఇంజనీర్. ఆమెను భారతదేశ బామ్మగా పిలుస్తారు. ఆమె రచయిత్రి, సామాజ సేవకురాలు. ఆమె దాదాపు 60,000 లైబ్రరీలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 16,000 మరుగుదొడ్లను నిర్మించారు. అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆమె చాలా జీవితాన్ని గడుపుతోంది. ఆమె తన పిల్లలైన అక్షత మూర్తి, రోహన్‌లకు చాలా సింపుల్ గా పెంచింది. అందరిలాగే.. తన పిల్లలను కూడా ఆటో రిక్షాలో పాఠశాలకు వెళ్లాలని చెప్పేవారట. ప్రముఖ వ్యాపార వేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్. నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఆమె ప్రముఖ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె 2010లో తన సొంత ఫ్యాషన్ లేబుల్ అక్షతా డిజైన్స్‌ని ఏర్పాటు చేశారు. 2011 వోగ్ ప్రొఫైల్ ప్రకారం.. సునక్ భార్య అక్షతా మూర్తి మారుమూల గ్రామాలలోని కళాకారులతో కలిసి భారతీయ సంస్కృతిని కనిపెట్టే వెస్ట్రన్ ఫ్యూజన్ దుస్తులను రూపొందించారు.




సింపుల్‌గా వివాహం:
విద్యనభ్యసించే సమయంలో రిషి సునాక్-అక్షతాకు పరిచమైన తర్వాత కాస్త ప్రేమగా మారింది. అక్షతా తల్లిదండ్రుల అంగీకారంతో 2009, ఆగస్టు 30వ తేదీన వీరి వివాహం జరిగింది. వేలాది కోట్ల ఆస్తులున్నప్పటికీ చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు భారత వంటకాలతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. వారి వివాహానికి కేవలం 500 మంది మాత్రమే హాజరు అయ్యారు. విప్రో చైర్మన్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రిషి సునాక్- అక్షతా మూర్తి వివాహానికి పెద్దగా హంగు అర్బాటాలు లేకుండా జరగడం గమనార్హం. ఇంత డబ్బు ఉన్నా ఎలాంటి పొకడలకు వెళ్లకుండా సింపుల్‌గా తమ వివాహాన్ని కానిచ్చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి