అరెస్ట్ బారి నుంచి మరోసారి బయటపడ్డ పాక్ మాజీ ప్రధాని.. సెప్టెంబర్ 1 వరకు బెయిల్ మంజూరు..

ఇమ్రాన్‌ వెంటనే ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఆ బెయిల్‌ గడువు ఆగస్టు 25న ముగియడంతో వెంటనే ఆయన్ని అరెస్టు చేయాలని పాక్‌ ప్రభుత్వం భావించింది.

అరెస్ట్ బారి నుంచి మరోసారి బయటపడ్డ పాక్ మాజీ ప్రధాని.. సెప్టెంబర్ 1 వరకు బెయిల్ మంజూరు..
Ex Pakistan Pm Imran Khan
Follow us

|

Updated on: Aug 26, 2022 | 7:20 AM

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు బారి నుంచి మారోసారి తాత్కాలికంగా బయట పడ్డారు. న్యాయస్థానం మరోసారి ఆయన బెయిల్‌ను పొడిగించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో ప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడారు. దేశ ద్రోహం ఆరోపణలపై తన సహచరుడు షాబాజ్‌గిల్‌ను అరెస్టు చేసిన పోలీసు ఉన్నతాధికారులు, మహిళా జడ్జీ, పాకిస్తాన్‌ ఎన్నికల సంఘంపై కేసులు పెడతామని హెచ్చరించడం వివాదస్పదమైంది. అప్పటి నుంచి ఆయన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం యాంటీ టెర్రర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది.

ఇమ్రాన్‌ వెంటనే ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఆ బెయిల్‌ గడువు ఆగస్టు 25న ముగియడంతో వెంటనే ఆయన్ని అరెస్టు చేయాలని పాక్‌ ప్రభుత్వం భావించింది. అయితే ఇమ్రాన్‌ కోర్టు ముందు హాజరు కావడంతో ఆయన బెయిన్‌ను సెప్టెంబర్‌ ఒకటో తేదీ వరకూ పొగడించారు. ఇందు కోసం ఆయన లక్ష రూపాయలు పూచీకత్తు కింద డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

కాగా, వచ్చే ఎన్నికల కోసం తాము ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నందున మరింత ఎక్కువ రోజులు బెయిల్‌ ఇవ్వాలని కోరినా, న్యాయస్థానం మరో వారం మాత్రమే పొడగించిందని ఇమ్రాన్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. కోర్టుకు పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్‌ అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.