AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 26 మ్యాచ్‌‌ల్లో నాన్‌స్టాప్ విజయాలు.. కట్ చేస్తే.. టీమిండియా దెబ్బకు ఊహించని షాక్..

India Vs England: ఇంగ్లండ్‌లో భారత్‌ గెలవడం అంత సులువు కాదు. కానీ 1971లో భారత్‌ చరిత్ర సృష్టించింది. తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.

Cricket: 26 మ్యాచ్‌‌ల్లో నాన్‌స్టాప్ విజయాలు.. కట్ చేస్తే.. టీమిండియా దెబ్బకు  ఊహించని షాక్..
India Vs England
Follow us
Venkata Chari

|

Updated on: Aug 24, 2022 | 9:03 AM

ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. అయితే, 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్లండ్‌లో భారత జట్టు నిరంతరం టెస్టు మ్యాచ్‌లు గెలుస్తూనే ఉంది. అయితే బ్రిటీష్ గడ్డపై ఈ భారత్ గెలవడం అంత సులభం కాదు. భారతదేశం 1971లో తొలిసారిగా ఇదే రోజున విజయం సాధించింది. అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో ఆగస్టు 24న ఇంగ్లండ్‌లో భారత్ తొలి టెస్టు విజయాన్ని సాధించింది. ఓవల్ మైదానంలో టీమిండియా ఈ విజయాన్ని అందుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ అద్భుతమైన స్కోర్‌ చేయడంతో పాటు భారత జట్టు లొంగిపోవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు విజయం అంత సులువు కాదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ జేమ్సన్ 82 పరుగులు చేశాడు. అలెన్ నాట్ 90 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రిచర్డ్ హటన్ 81 పరుగులు చేశాడు. ఈ స్కోరు ముందు భారత జట్టు 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో దిలీప్ సర్దేశాయ్ 54 పరుగులు చేశాడు. ఫరూక్ ఇంజినీర్ 59 పరుగులు చేశాడు.

అద్భుతం చేసిన చంద్రశేఖర్..

ఇవి కూడా చదవండి

అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టిన భారత్.. పెద్దగా స్కోరు చేయనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ స్పిన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చిక్కుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో చంద్రశేఖర్ 38 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ జట్టు 101 పరుగులకే ఆలౌటైంది. చంద్రశేఖర్‌తో పాటు శ్రీనివాస్ వెంకటరాఘవన్ రెండు వికెట్లు, బిషన్ సింగ్ బేడీ ఒక వికెట్ తీశారు.

చివరి రోజు విజయం..

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌కు ఒకటిన్నర రోజుల సమయం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. మ్యాచ్ చివరి రోజు అంటే ఆగస్టు 24న భారత్ ఈ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇందులో వాడేకర్ 45 పరుగులు చేశాడు. దిలీప్ సర్దేశాయ్ 43 పరుగులు చేయగలిగాడు. గుణప్ప విశ్వనాథ్ 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంజనీర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించిన తర్వాతే వెనుదిరిగాడు. సయ్యద్ అబిద్ అలీ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో భారత్‌కు ఇదే తొలి టెస్టు విజయం.

పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు