Cricket: 39 ఫోర్లు, 7 సిక్సర్లు.. సెంచరీలతో బౌలర్ల ఊచకోత.. వన్డేల్లో మరో రికార్డు!
6,6,4,4,6,6.. ఇవి ఫోన్ నెంబర్‌లోని సంఖ్యలు కావు.. ఇద్దరు బ్యాటర్లు స్కోర్ బోర్డుపై సృష్టించిన బీభత్సం. బౌండరీలతో బౌలర్లను ఉతికారేశారు.
ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న రాయల్ లండన్ కప్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్లు ఊచకోత కోస్తున్నారు. ముఖ్యంగా ససెక్స్ బ్యాటర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తమ జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ససెక్స్ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకుని.. సెమీఫైనల్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా వెటరన్ ఆటగాడు పుజారాతో పాటు ఓపెనర్ అల్సోప్ అద్భుతమైన సెంచరీలతో అదరగొట్టారు. మంగళవారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లకు ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది.
ఓపెనర్ అల్సోప్ 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 189 పరుగులు చేయగా.. కెప్టెన్ పుజారా 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. టెస్ట్ బ్యాటర్‌గా పేరొందిన పుజారా కేవలం 75 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం గమనార్హం. ఈ టోర్నీలో పూజారాకి ఇది మూడో సెంచరీ కాగా.. అల్సోప్‌ది తొలి సెంచరీ.
మరోవైపు భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ జట్టు 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు వికెట్ కీపర్ క్రాక్‌నెల్(71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ బౌలర్లలో క్రోకంబ్, రాలిన్స్ చెరో 3 వికెట్లు.. కర్వేలాస్, కర్రీ, ప్రెంటిస్, కలేస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ విజయంతో ససెక్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడమే కాదు.. సెమీఫైనల్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది.
Our highest-ever List A total and through to the semi-final. ?
Read all about our win over Middlesex! ? ⬇ #SharkAttack
— Sussex Cricket (@SussexCCC) August 23, 2022
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..