Telugu News World Go back to India Racial assualt on Indian American womens in Dallas US Watch Video
Indian Americans: అమెరికాలో దారుణం.. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ భారతీయ మహిళలపై దాడి.. వీడియో
నలుగురు ఇండో-అమెరికన్ మహిళలపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో టెక్సాస్ పోలీసులు గురువారం ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ వీడియోలో ఆమె మహిళలను దుర్భాషలాడుతూ కనిపిస్తోంది.
Racial assualt on Indian Americans: అమెరికాలో మెక్సికన్ మహిళ రెచ్చిపోయింది. జాత్యహంకార దూషణలతో భారతీయ మహిళలపై దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు సెల్‌ఫోన్‌లో రికార్డ్ కావడంతో.. వాటి ఆధారంగా అమెరికా పోలీసులు చర్యలు చేపట్టారు. నలుగురు ఇండో-అమెరికన్ మహిళలపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో టెక్సాస్ పోలీసులు గురువారం ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ వీడియోలో ఆమె మహిళలను దుర్భాషలాడుతూ కనిపిస్తోంది. దీంతోపాటు భారతదేశానికి తిరిగి వెళ్లండంటూ వారిపై దాడికి పాల్పడుతుంది. ఈ ఘటన టెక్సాస్‌లోని డల్లాస్‌లోని పార్కింగ్ స్థలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితురాలిని.. మెక్సికన్-అమెరికన్ మహిళను ప్లానోకు చెందిన ఎస్మెరాల్డా అప్టన్‌గా గుర్తించారు.
This is a wake up call to all HUMANS and color be nice to all – don’t throw racism… it’s a learning curve. #stophate#racism look at the outcome.. Racism still happens everyday – wish it would stop. https://t.co/l1OeAczx3J
నిందితురాలు వీడియోలో మాట్లాడుతూ.. భారతీయులను ద్వేషిస్తున్నానని.. ఈ భారతీయులందరూ మెరుగైన జీవితాన్ని కోరుకుంలూ అమెరికాకు వస్తున్నారంటూ అసభ్యకరంగా తిడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ప్రవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని భారతీయులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
UPDATE: Assaulter in video above Esmeralda Upton of Plano Texas has been ARRESTED by Police detectives this afternoon. She faces 2 charges of Assault Bodily Injury and Terroristic threat. Held on $10,000 bond.
ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ఈ సంఘటన టెక్సాస్‌లోని డల్లాస్‌లో తన అమ్మ, ఆమె ముగ్గురు స్నేహితులు కలిసి భోజనానికి వెళ్లగా ఇలా జరిగింది అంటూ రాశారు. బాధితులు జాతి దూషణలు చేయవద్దని అభ్యర్థించడం కనిపిస్తుంది. పోలీసులు గురువారం మధ్యాహ్నం ప్లానోకు చెందిన ఎస్మెరాల్డా అప్టన్‌ను అరెస్టు చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సమయంలో ఆమె దగ్గర తుపాకీ కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. జాత్యహంకార దూషణలు చేసిన నిందితురాలిపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.