AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు.  ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తదితరులు హాజరయ్యారు. 

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
Chandrababu Naidu Revanth Reddy
Janardhan Veluru
|

Updated on: Jan 20, 2025 | 1:53 PM

Share

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్‌ మొదలైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీపడుతున్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ రేవంత్ రెడ్డి జ్యూరక్ చేరుకున్నారు.

జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు.  ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.

Ap Cm Chandrababu Meets Revanth Reddy In Zurich Airport

Ap Cm Chandrababu Meets Revanth Reddy In Zurich Airport

జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు.

అలాగే జ్యూరక్‌లోని హోటల్‌ హిల్టన్‌లో “తెలుగు డయాస్పొరా మీట్‌”లో  చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యూరప్‌ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు..పలు కంపెనీల CEOలు పాల్గొన్నారు. దావోస్‌లో తనకు స్వాగతం పలికిన యూరఫ్‌లోని తెలుగు వారికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు  జ్యూరిచ్‌ వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు  మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్,  అధికారుల బృందం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.