కారుతో తొక్కించి 35 మంది ప్రాణాలు తీసిన వ్యక్తికి మరణశిక్ష.. అమల్లోకి కోర్టు తీర్పు..
తీర్పు వెలువడిన మూడు వారాల తర్వాత ఈ ఉరిశిక్ష అమలులోకి వచ్చింది. జుహైలో కారు విధ్వంసం నవంబర్ 11న జరిగింది. అయితే, ఆ రోజు తనకు తన భార్య నుంచి విడాకులు వచ్చాయట. తనకు జరిగిన అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఆవేదనలో కారును వేగంగా నడిపించాడు. ఈ క్రమంలోనే జుహై స్పోర్ట్స్ సెంటర్‌లో వ్యాయామం చేస్తున్న ప్రజలపైకి తన ఆఫ్-రోడ్ వాహనాన్ని వేగంగా నడిపించాడు.. ఆ తర్వాత

చైనాలో ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి 35 మంది ప్రాణాలను బలితీసుకున్న వార్త ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడికి మరణశిక్ష పడగా న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడికి శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫాన్ వీకియూ (62) గతేడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరంలో కారుతో జనంపైకి దూసుకెళ్లడంతో 35 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు ఉరిశిక్ష విధించింది.
తీర్పు వెలువడిన మూడు వారాల తర్వాత ఈ ఉరిశిక్ష అమలులోకి వచ్చింది. జుహైలో కారు విధ్వంసం నవంబర్ 11న జరిగింది. అయితే, ఆ రోజు తనకు తన భార్య నుంచి విడాకులు వచ్చాయట. తనకు జరిగిన అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఆవేదనలో కారును వేగంగా నడిపించాడు. ఈ క్రమంలోనే జుహై స్పోర్ట్స్ సెంటర్‌లో వ్యాయామం చేస్తున్న ప్రజలపైకి తన ఆఫ్-రోడ్ వాహనాన్ని వేగంగా నడిపించాడు.. ఆ తర్వాత కారులో తనను తాను కత్తితో గాయపరిచేందుకు ప్రయత్నించిన పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అనంతరం కోలుకున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో బాధిత కుటుంబాలు, అధికారులు, ప్రజల ముందు అతడు తన నేరాన్ని అంగీకరించినట్టుగా పోలీసులు, మీడియా నివేదికలు వెల్లడించాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




