AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggar Buys iPhone: బిచ్చగాడి చేతిలో రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్‌.. అసలు ముచ్చట తెలిస్తే షాకే..!

తాను ఈఎంఐ లేదా లోన్‌పై ఫోన్‌ని కొనుగోలు చేయలేదని, ఏకంగా వన్‌టైమ్‌ పేమెంట్‌ విధానంలో నగదు రూపంలో చెల్లించానని ఆ వ్యక్తి చెప్పాడు. బిచ్చగాడి మాటలు విని అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు. ఇకపోతే, బిచ్చగాడికి పరిచయమైన ఆ వ్యక్తి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వాడిగా తెలిసింది. అతడు వికలాంగుడు, నిరాశ్రయుడు అని తెలిసింది. దీంతో నెటిజన్లు వీడియోపై భిన్నమైన కామెంట్లు చేశారు.

Beggar Buys iPhone: బిచ్చగాడి చేతిలో రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్‌.. అసలు ముచ్చట తెలిస్తే షాకే..!
Beggar Holding An Iphone
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2025 | 3:23 PM

Share

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనడం చాలా మంది కల. ఈ ఫోన్ ధర లక్షల్లో ఉంది. మంచి ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాని అవసరాన్ని గురించి ఆలోచిస్తారు. కానీ, ఓ బిచ్చగాడి చేతిలో iPhone 16 Pro Maxని చూసి సోషల్ మీడియాలో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బిచ్చగాడు చెప్పిన మాటలు ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి. అతడు, అక్షరాల నగదు చెల్లించి లక్షల విలువ చేసే ఫోన్‌ను కొనుగోలు చేశానని చెప్పాడు. సదరు బిచ్చగాడికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వారెవ్వా అంటూ నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ కుమ్మరించారు.

వైరల్‌గా మారిన ఈ వీడియో రాజస్థాన్‌కు చెందినదిగా చెబుతున్నారు. 1.44 లక్షల విలువైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను బిచ్చగాడు వాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. తాను ఈఎంఐ లేదా లోన్‌పై ఫోన్‌ని కొనుగోలు చేయలేదని, ఏకంగా వన్‌టైమ్‌ పేమెంట్‌ విధానంలో నగదు రూపంలో చెల్లించానని ఆ వ్యక్తి చెప్పాడు. బిచ్చగాడి మాటలు విని అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు. ఇకపోతే, బిచ్చగాడికి పరిచయమైన ఆ వ్యక్తి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వాడిగా తెలిసింది. అతడు వికలాంగుడు, నిరాశ్రయుడు అని తెలిసింది. దీంతో నెటిజన్లు వీడియోపై భిన్నమైన కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియో చూసిన నెటిజన్లు బిచ్చగాడి జీవితం ఉత్తమ వ్యాపారమని, ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం లేదని మరికొందరు వ్యాఖ్యనించారు. పెద్దగా శ్రమ, ఒత్తిడి ఉండదు. మీరు మీ అభిరుచిని నెరవేర్చుకోవాలనుకుంటే ఇది ఉత్తమమైనదిగా ఇంకొందరు వర్ణించారు.. ఈ వీడియో షేక్‌ అని ఒకరు రాయగా, ఈ వీడియోను వైరల్ చేసేందుకు ఎవరో తమ ఫోన్‌ను అతడి చేతిలో పెట్టారని అంటున్నారు. బిచ్చగాళ్లు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి వారికి దానం చేయడం మానేశాను అని మరో సోషల్ మీడియా యూజర్ రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..