AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో మళ్లీ గన్‌ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్‌ యువకుడి మృతి..

అమెరికాలో గన్‌కల్చర్ తెలుగోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. చదువుకోడానికెళ్లిన మనోళ్లు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది. చేతికో తుపాకీ చొప్పున అక్కడ చెలరేగిపోతున్న గన్‌ కల్చర్‌‌కు .. తాజాగా ఓ తెలుగు స్టూడెంట్‌ బతుకు తెల్లారిపోయింది. ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి చనిపోయాడు. బుల్లెట్ తగలడంతోనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అమెరికాలో మళ్లీ గన్‌ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్‌ యువకుడి మృతి..
Hyderabad Student Shot Dead In Washington
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jan 20, 2025 | 11:44 AM

Share

అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ పెట్రేగిపోతోంది.. చదువుకోడానికెళ్లిన యువత ప్రాణాలను తీస్తున్న గన్ కల్చర్.. తాజాగా మరొకరి ప్రాణం తీసింది..అగ్రరాజ్యం అమెరికాలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతిచెందాడు.. వాషింగ్టన్ ఏవ్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది..

హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కే పురం, గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలోనే.. వాషింగ్టన్ ఏవ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు..

రవితేజ మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ రవితేజ తండ్రి విలపిస్తున్నారు. తన బాధ ఎవరికీ చెప్పుకోలేనిది అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

యూఎస్‌లో గన్‌కల్చర్‌ కారణంగా..

పెచ్చుమీరిపోతున్న తుపాకీ సంస్కృతికి గతంలో చాలామంది తెలుగు విద్యార్థులు బలైపోయారు. యూఎస్‌లో గన్‌కల్చర్‌ కారణంగా పదుల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు పోయాయి.. చదువుకోడానికెళ్లిన విద్యార్థులు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొనడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. అమెరికా వెళ్లి చదువుకోవాలని, అక్కడ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది భారతీయ యువత కల. దాని కోసం ఎంత కష్టపడైనా, ఆర్థికంగా మంచి స్థాయిలో లేకపోయినా ఎన్నో కష్టాలు ఓర్చుకుని బాధలు అనుభవించి విదేశాలకు పయనమయ్యే యువతీయువకులు ఎంతో మంది ఉన్నారు.. కానీ, అలాంటి అగ్ర రాజ్యంలో మనిషి ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తుంది. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని భావించే ఎంతో మంది భారతీయ పౌరుల కల.. కలగానే మిగిలిపోతుందంటూ పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్