చైనీయుల బుర్రలే బుర్రలు ! తోడేలనుకుని జూ లో కుక్కను ఉంచారు, ఎందుకంటే ?

ఓ వైపు చైనా వాళ్ళు చాలా మేధావులని ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటుంటే మరోవైపు వారి తెలివి తెల్లారినట్టే ఉందని కూడా అంటున్నారు. ఇందుకు కారణం వారు తోడేలనుకుని ఓ కుక్కను జూ లో బంధించడమే.

చైనీయుల బుర్రలే బుర్రలు ! తోడేలనుకుని జూ లో కుక్కను ఉంచారు, ఎందుకంటే ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2021 | 12:13 PM

ఓ వైపు చైనా వాళ్ళు చాలా మేధావులని ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటుంటే మరోవైపు వారి తెలివి తెల్లారినట్టే ఉందని కూడా అంటున్నారు. ఇందుకు కారణం వారు తోడేలనుకుని ఓ కుక్కను జూ లో బంధించడమే. సెంట్రల్ చైనా లోని హుబె ప్రావిన్స్ లో గల జియాంగ్ వుషాన్ జూలో ఆశ్చర్యకరమైన ఈ దృశ్యం కనబడింది. ఓ పెద్ద మనిషి ఈ జూకు వెళ్లి రకరకాల జంతువులను చూస్తూ చటుక్కున ఓ చోట ఆగిపోయాడు. తోడేలు అని బోర్డు రాసి ఉన్న ఓ ఎన్ క్లోజర్ వద్ద పరీక్షగా చూస్తే లోపల ఓ పెద్ద కుక్క కనబడింది. అంతే ! ‘ వూఫ్ ! ఆర్ యూ ఎ వుల్ఫ్ ” (వావ్ ! నువ్వు తోడేలువా)  అంటూ తనకు తానే అరిచినంత పని చేశాడు. ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. అనేకమంది ఆశ్చర్యపోతూ దీనిపై రకరకాలుగా ట్వీట్లు చేశారు.

అయితే కరోనా వైరస్ పాండమిక్  సమయంలో తమ జూకు నిధుల కటకట ఏర్పడినందున ఇలా ఏదో ఒకటి చేయాల్సి వచ్చిందని ఈ జూ ఉద్యోగి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఎన్ క్లోజర్ లో తోడేలు ఉండేదని, అయితే అది ముసలిదై చనిపోయిందని ఆయన అన్నాడు. దాంతో ఆ ఎన్ క్లోజర్ ని ఖాళీగా ఉంచడమెందుకని తాత్కాలికంగా కుక్కను తెఛ్చి అక్కడ ఉంచామన్నాడు. ఇది విని మరింత ఆశ్చర్య పోతూ ఆ పెద్ద మనిషి నోరెళ్ళబెట్టాడు. ఇది నమ్మాలో, నమ్మకూడదో తెలియలేదు ఆయనకు.

గతంలో కూడా జూలో సైబీరియా పులులకు ఉద్దేశించిన ఓ ఎన్ క్లోజర్ లో వాటి బదులు  ఇలాగే కుక్కను ఉంచిన ‘ఘనత’ చైనావారికే ‘దక్కింది’.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్‌ మార్చ్‌

Nick Jonas About Priyanka : భూమి మీద ఉన్న అందమైన మహిళల్లో నా భార్య సెపరేట్ అంటున్న నిక్ జోనాస్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!