AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nick Jonas About Priyanka : భూమి మీద ఉన్న అందమైన మహిళల్లో నా భార్య సెపరేట్ అంటున్న నిక్ జోనాస్

బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంటల్లో ఒకటి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. గత ఏడాది డిసెంబర్ తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట.. అయితే ఇటీవల ఓ ఇంటర్యులో ప్రియాక చోప్రా గురించి ఆమె అందం గురించి భర్త నిక్ జోనాస్ సంచలన కామెంట్స్..

Nick Jonas About Priyanka : భూమి మీద ఉన్న అందమైన మహిళల్లో నా భార్య సెపరేట్ అంటున్న నిక్ జోనాస్
Surya Kala
|

Updated on: Mar 10, 2021 | 12:25 PM

Share

Nick Jonas About Priyanka : బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంటల్లో ఒకటి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్.  గత ఏడాది డిసెంబర్ 1న తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట.. అయితే ఇటీవల ఓ ఇంటర్యులో ప్రియాక చోప్రా గురించి ఆమె అందం గురించి భర్త నిక్ జోనాస్ సంచలన కామెంట్స్ చేశాడు.

ఈ భూమి మీద ఉన్న అందమైన మహిళల కంటే తన భర్య ప్రియాంక వేరు అని చెప్పారు. అంతేకాదు తాను గతంలో డేటింగ్ చేసిన మహిళల్లో ప్రియాక సెపరేట్.. తమ ఇద్దరి మధ్య వివాహ బంధం కంటే ముందు స్నేహం ఉందని.. తమ బంధాన్ని బలోపేతం చేయడానికి తమ మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఉపయోగపడిందన్నారు నిక్. నిక్ కొత్త ఆల్బమ్ ఆల్బం స్పేస్ మాన్ ను ప్రమోషన్ కార్యక్రమంలో ప్రియాంక గురించి అడిగిన ప్రశ్నలకు తదైన శైలిలో సమాధానం చెప్పారు. మేము చాలా అదృష్టవంతులం. మేము డేటింగ్ ప్రారంభించడానికి ముందు ఒకరినొకరు బాగా తెలుసు. మా మధ్య సహజమైన రిలేషన్ ఏర్పడిందని చెప్పారు. ప్రియాంక వంటి భార్యను కలిగి ఉండడం అదృష్టమని అన్నారు. నిక్.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఓ సిరీస్ తో అడుగు పెట్టింది. అక్కడ ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంత కాలం డేటింగ్ చేశారు. అనంతరం 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. ఈ జంట హిందూ , క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగా జోధ్పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో రెండు సార్లు ఒకటయ్యారు. ఎంతో వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

ఈ జంట తమకు ఎప్పుడు ఖాళీ దొరికినా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరిపై ఒకరి ఉన్న ప్రేమను వివిధరకాలుగా వ్యక్తపరిస్తుంటారు. అప్పుడప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు ప్రియాంక, నిక్ జంట

Also Read: